రాజధాని రైతులు, ప్రజలకు అండగా నిలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న
రాజధాని రైతులు, ప్రజలకు అండగా నిలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్..జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కరెక్ట్ కాదన్నారు. మంగళవారం(డిసెంబర్ 31,2019) రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీపైనా విమర్శలు చేశారు.
తుళ్లూరులో మాట్లాడిన పవన్.. రాజధాని విషయంలో అమరావతి ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటానికి చంద్రబాబు మద్దతుగా నిలవాలని పవన్ అన్నారు. ”టీడీపీ కూడా ఈ పోరాటానికి బలమైన బాధ్యత తీసుకోవాలి. రెండు కళ్ల సిద్ధాంతం, ఒంటి కన్ను సిద్ధాంతం అంటే కుదరదు. ఒక మాట, ఒక ధర్మం మీద నిలబడి ఉండాలి” అని చంద్రబాబుని ఉద్దేశించి పవన్ అన్నారు.
పబ్లిక్ మీటింగ్ లో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్న పవన్ కు తీవ్రమైన కోపం తెప్పించింది. అతడికి ఘాటుగా బదులిచ్చారు పవన్. ”నాకు నీ ఓటు అవసరం లేదు. నన్ను అడిగే హక్కు నీకు లేదు. ఇక్కడ ఉన్నది జగన్, చంద్రబాబు కాదు.. పవన్. ఆ రోజు నన్ను అడిగి రాజధాని ఇవ్వలేదు. నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు” అని ఆ వ్యక్తిపై పవన్ ఫైర్ అయ్యారు.