×
Ad

ఇటు పార్టీ.. అటు ప్రభుత్వం.. జనసేన బలోపేతం కోసం పవన్ ఈ మోడల్‌ను ఫాలో అవుతున్నారా?

అధికారంలోకి వచ్చి 18 నెలలు అయిపోవడంతో..పార్టీ నిర్మాణంపై కాన్సన్‌ట్రేట్ చేయాలని భావిస్తున్నారట పవన్ కల్యాణ్.

Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా, పలు శాఖలకు మంత్రిగా బాధ్యత నిర్వహిస్తూ..మరోవైపు జనసేన పార్టీ అధినేతగా..తన మార్క్ డెసిషన్స్ తీసుకుంటున్నారు పవన్ కల్యాణ్. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జనసేన పార్టీని గ్రౌండ్ లెవల్‌లో మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల్లో సాధించిన అఖండ విజయాన్ని కేవలం అధికారానికే పరిమితం చేయకుండా, పార్టీ క్యాడర్‌ను గ్రౌండ్‌ నుంచి పటిష్టం చేసి..తిరుగులేని శక్తిగా మార్చాలన్న వ్యూహంతో ఉన్నారట.

ఈ క్రమంలోనే ఈ నెల 22న మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భారీ స్థాయిలో ఒక కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ మీటింగ్‌లో ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు ప్రాధాన్యత ఇస్తూ, పార్టీ భవిష్యత్‌ కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. (Pawan Kalyan)

ఇప్పటికే పవన్‌ కల్యాణ్ ఫైవ్‌ మెన్ కమిటీ ప్రపోజల్ తెచ్చారు. తన నియోజకవర్గం పిఠాపురం నుంచే ఐదుగురు సభ్యుల టీమ్‌ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నారు. 22న పార్టీ కీలక సమావేశం ఉన్న నేపథ్యంలో..పవన్‌ ఎమ్మెల్యేలతో వన్ టు వన్ భేటీ అవడం ఆసక్తికరంగా మారింది. తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పవన్‌ ఒక్కొక్కరితో ప్రత్యేకంగా భేటీ అయి వివిధ అంశాలపై డిస్కస్ చేశారు.

Also Read: మేఘారెడ్డి Vs చిన్నారెడ్డి.. కొత్తగా మరో నేత ఎంట్రీ.. పల్లె పోరులో దెబ్బతిన్నారా?

వ్యూహాలు, యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తూ..
ఇప్పటివరకు నియోజక వర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వివరాలు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలతో పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.

ఎమ్మెల్యేలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సూచించారు. కూటమి పార్టీలు టీడీపీ, బీజేపీ నేతలతో కలుపుకుని పోవాలని డైరెక్షన్స్ ఇచ్చారట. సేమ్‌టైమ్‌ పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పారట. కూటమిలోనే ఉంటూ సొంతంగా మరింత బలపడేందుకు ప్రయత్నించాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారట పవన్.

అధికారంలోకి వచ్చి 18 నెలలు అయిపోవడంతో..పార్టీ నిర్మాణంపై కాన్సన్‌ట్రేట్ చేయాలని భావిస్తున్నారట పవన్ కల్యాణ్. రాబోయే ఎన్నికల నాటికి గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్యాడర్, లీడర్ల బలోపేతం..ఎక్కడికక్కడ స్ట్రాంగ్ లీడర్లు..సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే కార్యకర్తలను తయారు చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారట. జనసేన బలమైన ప్రాంతీయ పార్టీగా నిలదొక్కుకునేలా వ్యూహాలు, యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట.

అందులో భాగంగా నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో భేటీ..ఎమ్మెల్యేలతో వన్ టు వన్‌ మీటింగ్‌ పెడుతున్నారని అంటున్నారు. త్వరలో నియోజకవర్గ స్థాయిలో క్యాడర్, లీడర్లకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించే ఆలోచనలో కూడా ఉన్నారు. ఏదైనా బిజీ షెడ్యూల్‌లో కూడా పవన్‌ పార్టీ కోసం టైమ్ కేటాయిస్తుండటంతో..జనసేన కార్యకర్తలు ఫుల్ హ్యపీగా ఫీల్ అవుతున్నారట.