ప్రజా క్షేమం కోరుతూ పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష

  • Publish Date - July 2, 2020 / 12:04 AM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టారు. ప్రజల క్షేమం, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సున కాంక్షిస్తూ పవన్ దీక్షకు పూనారు. నాలుగు మాసాలపాటు పవన్ కళ్యాణ్ దీక్ష కొనసాగుతుంది. దీక్ష కాలంలో ఒకపూటే భోజనం చేస్తారు. కరోనాతో అన్ని వర్గాల ప్రజలు ఉపాధి కోల్పోయి అల్లాడిపోతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు సాధారణ జీవనం సాగించాలని కోరుతూ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.

బుధవారం తొలి ఏకాదశి. శయనై ఏకాదశిగా పిలుస్తారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్ చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు దీక్షను ప్రారంభించి ఆయన కార్తీక శుక్ల ఏకాదశి నాడు విరమిస్తారు. దీక్షను విరమించే సమయంలో హోమాన్ని నిర్వహించబోతున్నారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజ మాసాల్లో దీక్ష కొనసాగుతంది. కార్తీక శుక్ల ఏకాదశి నాడు దీన్ని విరమిస్తారు.

చాతుర్మాస్య దీక్షలో ఉన్ననంత కాలం పవన్ కళ్యాణ్ మాంసాహారానికి దూరంగా ఉంటారు. మితంగా ఆహారాన్ని తీసుకుంటారు. సాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు. అది కూడా ఒక్కపూట మాత్రమే. సూర్యాస్తమయం అనంతరం కొద్దిగా పాలు, పండ్ల ఆహారంగా తీసుకుంటారు.

రాత్రి శాకాహారం భోజనంతో ఆ రోజుకు దీక్షను ముగిస్తారు. ఇలా కార్తీక శుక్ల ఏకాదశి వరకూ కొనసాగిస్తారు. దీక్ష విరమణ రోజున హోమాన్ని నిర్వహించి.. పూర్ణాహూతితో దీక్షను విరమిస్తారు. అదే రోజు భారీ ఎత్తున చండీ హోమాన్ని నిర్వహించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.