Atchutapuram SEZ accident: కంపెనీ యజమానుల మధ్య విభేదాలు ఉన్నాయి.. అందుకే..: పవన్ కల్యాణ్

సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని అన్నారు.

Andhra Pradesh Deputy CM Pawan kalyan

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో చోటుచేసుకున్న ప్రమాద ఘటన తనను కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఇలాంటివి తరుచూ జరుగుతున్నాయని, ఆ కంపెనీకి చెందిన ఇద్దరు యజమానులకు విభేదాలు ఉన్నాయని, అందుకే నిర్వహణ సరిగ్గా లేదని తెలిపారు.

సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని అన్నారు. సేఫ్టీ అడిట్ అంటే కంపెనీల యాజమానులు భయపడుతున్నారని, అలా భయపడితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. సేఫ్టీ అడిట్లు చేస్తే పరిశ్రమలు వెళ్లిపోతాయనే వదంతు ఉందని చెప్పారు. పరిశ్రమలు ఉండటం ఎంత ముఖ్యమో సేఫ్టీ కూడా అంతే ముఖ్యమని అన్నారు.

విశాఖ పొల్యూషన్, పరిశ్రమల సేఫ్టీపై తాను చర్యలు తీసుకుంటానని చెప్పారు. త్వరలోనే విశాఖలో అధికారులు, పరిశ్రమల యజమానులలతో చర్చిస్తానని అన్నారు. సేఫ్టీపై నిరంతర సమీక్ష లేకపోవడం వల్లే ప్రమాదాలు రిపీట్ అవుతున్నాయని చెప్పారు. ప్రాణాలు పోకుండా కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని, పర్యావరణ సమతుల్యత పాటించే విధంగా పరిశ్రమలు ఉండాలని చెప్పారు.

Also Read: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసు.. సీల్డ్ కవరులో స్టేటస్ రిపోర్టు

ట్రెండింగ్ వార్తలు