pawan kalyan
పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి ఏపీలోని మంగళగిరిలో నిర్వహించిన నివాళుల కార్యక్రమంలో పవన్ పాల్గొని మాట్లాడారు.
పహల్గాం దాడిలో మృతి చెందిన కావలివాసి మధుసూదన్ రావు కుటుంబానికి జనసేన తరఫున రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మధుసూదన్ రావు ఎవరికి హాని చేశారని పవన్ ఈ సందర్భంగా నిలదీశారు. ఆయన ఫ్యామిలీతో కశ్మీర్‌కు వెళ్తే చంపేశారని పవన్ అన్నారు. కశ్మీర్ మనది కాబట్టే ఆ ప్రాంతానికి వెళ్లామని ఆయన భార్య తెలిపారని చెప్పారు.
Also Read: 6 లేన్లుగా హైదరాబాద్-విజయవాడ హైవే.. ఒక్కో కి.మీకి రూ.20 కోట్ల ఖర్చు
హిందువులకు ఉన్న దేశం భారత్ ఒక్కటేనని, ఇక్కడ సైతం ఉండొద్దని అంతే మరి ఎక్కడికి పోవాలని ఆయన ప్రశ్నించారు. పహల్గాంలో మత ప్రాతిపదికన ఉగ్రవాదులు 26 మందిని చంపారని, అయినప్పటికీ కొందరు పాక్‌ను అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని నిలదీశారు. అటువంటి కామెంట్స్ చేసేవారు పాక్‌కే వెళ్లిపోవాలని చెప్పారు.
దేశానికి సహనం ఎక్కువైందని, అతి మంచిది కాదని చెప్పారు. వచ్చి కాల్చేసి పోతామంటే మనం ఎందుకు ఊరుకోవాలంటూ నిలదీశారు. అసలు ఎంతమంది పాక్ వ్యక్తులు మన దేశానికి వచ్చి ఉంటున్నారో మనకు తెలియదని చెప్పారు. ఏ ముసుగులో ఇక్కడ ఉంటున్నారో తెలియదని తెలిపారు. పదవులు, విజయవాలతు ముఖ్యం కాదని, ఎంత బాధ్యతగా ఉన్నామన్నదే ముఖ్యమని చెప్పారు.