6 లేన్లుగా హైదరాబాద్‌-విజయవాడ హైవే.. ఒక్కో కి.మీకి రూ.20 కోట్ల ఖర్చు

ఇప్పటికే 6 లేన్లకుగాను భూమిని సేకరించారు. జాతీయ రహదారి విస్తరణకు టెక్నికల్‌గా పలు అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.

6 లేన్లుగా హైదరాబాద్‌-విజయవాడ హైవే.. ఒక్కో కి.మీకి రూ.20 కోట్ల ఖర్చు

Updated On : April 29, 2025 / 12:32 PM IST

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని విస్తరించేందుకు డీపీఆర్‌ను మే నెల చివరి నాటికి పూర్తిచేయించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ యోచిస్తోంది. ఎన్‌హెచ్‌-65ను 6 లేన్లుగా విస్తరించాలని కేంద్ర సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇందుకుగానూ కిలోమీటరుకు దాదాపు రూ.20 కోట్ల చొప్పున అవుతుందని అధికారుల అంచనా. ఎన్‌హెచ్‌-65ను దండు మల్కాపూర్‌ నుంచి ఏపీలోని గొల్లపూడి వరకు ఆరు లేన్లుగా విస్తరిస్తారు. దీంతో 265 కిలోమీటర్లకు మొత్తం రూ.5,300 కోట్లు అవుతాయి.

Gold And Silver Price: తగ్గినట్లే తగ్గి మళ్లీ ఝలక్ ఇచ్చిన బంగారం ధరలు

జూన్‌ తొలి వారంలో ఇందుకు సంబంధించిన పనులకు అనుమతులను తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. డీపీఆర్‌ రూపొందించే వర్క్‌ను భోపాల్‌కు చెందిన సంస్థ ఇప్పటికే దక్కించుకుంది. ఆ సంస్థతో పాటు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు ఈ విస్తరణ పనుల ప్రక్రియపై సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు.

ఇప్పటికే 6 లేన్లకుగాను భూమిని సేకరించారు. జాతీయ రహదారి విస్తరణకు టెక్నికల్‌గా పలు అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని విస్తరణలో భాగంగా మార్గమధ్యంలో పలు ప్రాంతాల్లో వెహికల్‌ అండర్‌ పాస్‌లు, రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, బ్రిడ్జిలు నిర్మిస్తారు. రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద వీయూపీ నిర్మించనున్నారు.