తిరుమల లడ్డూ వివాదంపై పవన్ మరోసారి కీలక వ్యాఖ్యలు

తిరుమల పవిత్రతను దెబ్బతీశారని గత వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan

తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం వైసీపీ హయాంలో వాడిన నెయ్యి కల్తీది అంటూ చెలరేగుతున్న వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. ప్రజల మనోభావాలతో ఎవరూ చెలగాటమాడొద్దని చెప్పారు.

స్వచ్ఛమైన నెయ్యి ధర అధికంగా ఉంటుందని తెలిపారు. అంతమాత్రాన తక్కువ ధరకు వస్తుందని కల్తీ నెయ్యిని ఎలా కొంటారని నిలదీశారు. తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జనాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ల్యాబ్‌ పరీక్షలు చేయాలని కోరారని చెప్పారు. లడ్డూ గురించి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ టీటీడీ గత ఛైర్మన్‌తో పాటు ఈవో పట్టించుకోలేదని తెలిపారు.

తాను శ్రీవారి లడ్డూ కల్తీ అయిందన్న విషయం తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానని అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీశారని గత వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యి కల్తీది అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ నేతలు అంటోన్న విషయం తెలిసిందే.

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కేంద్రం సీరియస్.. సీఎం చంద్రబాబుకి కీలక ఆదేశం