Pawan Kalyan: ఎన్ని అరుపులు అరిచినా.. వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చురకలు

రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌లో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసి ఒక్కసారిగా రాజకీయంగా యాక్టీవ్ అయిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan: రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌లో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసి ఒక్కసారిగా రాజకీయంగా యాక్టీవ్ అయిన పవన్ కళ్యాణ్.. వరుసగా ట్విట్టర్‌లో కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ప్రభుత్వం పాలన సరిగ్గాలేదని ఆరోపించిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్‌గా ట్విట్టర్‌లో మరో ట్వీట్ ద్వారా వైసీపీ ప్రభుత్వపై విమర్శలు సంధించారు.

“ఎన్ని వాగ్దానాలు చేసినా, ఎన్ని అరుపులు అరిచినా.. రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా.. సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు.. పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు.. ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని ‘వైసీపీ ప్రభుత్వం’ మరిచినట్టుంది.” అంటూ ట్విట్టర్‌లో విమర్శించారు.