Pawan Kalyan: నేను ఎన్డీఏ నుంచి బయటకు రావాలని అనుకుంటే..: పవన్ కామెంట్స్

ఎన్డీఏ నుంచి బయటకు రావాలని అనుకుంటే తానే చెబుతానని పవన్ కల్యాణ్ అన్నారు. అంతేగానీ,

Pawan Kalyan

Pawan Kalyan: వైసీపీ తమను చూసి భయపడుతోందని, దీంతో తమకు బలం ఉన్నట్లు ఆ పార్టీ నేతలు ఒప్పుకున్నట్లేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా ముదినేపల్లిలో వారాహి యాత్రలో పవన్ మాట్లాడారు. సాధారణంగా 151 ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ పార్టీ తమ జనసేనను చూసి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

ఎన్డీఏ నుంచి బయటకు రావాలని అనుకుంటే తానే చెబుతానని పవన్ కల్యాణ్ అన్నారు. అంతేగానీ, వైసీపీ వారు చెప్పడం ఏంటని నిలదీశారు. తాము ఎన్డీఏలో ఉన్నామని, తమ గురించి వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.

జనసేన పార్టీ ఎన్డీఏలో ఉంటే ఏంటి? బయట ఉంటే ఏంటి? మీకెందుకు భయం? అని అన్నారు. తనకే 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్షాల ఊసే ఎత్తనని చెప్పారు. మరో 5 నెలలు ఉంటారో లేదంటే తెలంగాణ ఎన్నికలతో కలిసి ఏపీలోనూ ఎన్నికలకు వెళ్తారో కానీ, వైసీపీ సంగతి తేలుస్తామని అన్నారు.

టీడీపీ-జనసేన కలిసినా వైసీపీ భయపడాల్సిన అవసరం లేదని, అయినప్పటికీ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. 175 సీట్లలోనూ గెలుస్తాం అనే వైసీపీకి టీడీపీ-జనసేన ఓ లెక్కా అంటూ ఎద్దేవా చేశారు.

పవన్ కల్యాణ్ కామెంట్స్

వైసీపీ రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా వెయ్యలేదు.. వారికి ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు?

కనీసం రోడ్డు వెయ్యని వాళ్ళకి 175 స్థానాలు ఎలా వస్తాయి?

భవిష్యత్తులో ఆస్తుల దస్తావేదులు ఇవ్వరు.. జగన్ దగ్గర ఉంటాయి..

ప్రజల అస్తి పేపర్స్ మీ దగ్గర ఉండటం ఏంటి?

కైకులూరు గ్రామాల్లో వైసీపీ జెండాలే ఉండాలి అంట

రానున్న రోజుల్లో వైసీపీ రహిత ఆంధ్ర ప్రదేశ్ ను చేస్తా

వైఎస్సార్ నే ఎదిరించా.. జగన్ ఎంత?

క్లాస్ వార్ అని చెప్పే జగన్ ఒక్క లక్ష సొంత డబ్బులు ఎవరికైనా ఇచ్చారా?

ఏపీలో కల్తీ మద్యం తాగి కిడ్నీ, నరాల, కాలేయ సమస్యలు వస్తున్నాయి..

మద్యపాన నిషేధం హామీ ఇచ్చి మద్యాన్ని అమ్ముతున్నారు..

మద్యానికి బాగా అలవాటు అయ్యారు.. కల్తీ లేని మద్యం ఉండాలి..

ప్రభుత్వం వచ్చిన నెలలోనే పాత ధరలు, పాత బ్రాండ్స్ అమ్ముతాం..

మహిళలు వద్దు అనుకునే చోట పూర్తిగా నిషేధిస్తాం…

Sajjala Ramakrishna Reddy : టీడీపీ బలహీన పడిందని పవన్ కల్యాణే చెప్పారు, అందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారు- సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్