Sajjala Ramakrishna Reddy : టీడీపీ బలహీన పడిందని పవన్ కల్యాణే చెప్పారు, అందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారు- సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్

చంద్రబాబు అరెస్ట్ తో జగన్ కు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబును జైల్లో పెట్టమని జగన్ చెప్పలేదు. కోర్టు చెప్పింది. Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy : టీడీపీ బలహీన పడిందని పవన్ కల్యాణే చెప్పారు, అందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారు- సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్

Sajjala Ramakrishna Reddy

Updated On : October 5, 2023 / 7:52 PM IST

Sajjala Ramakrishna Reddy – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ గా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని స్వయంగా పవన్ కల్యాణే ఒప్పుకున్నారని సజ్జల అన్నారు. ఈ మేరకు నిన్న టీడీపీపై పవన్ చేసిన కామెంట్స్ వీడియో చూపించారు సజ్జల.

ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారో పవన్ చెప్పాలి..
”ఎన్డీయే నుంచి బయటికి వచ్చానని పవన్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ బలహీన పడిందని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపీ నేతలు స్పందించాలి. జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందో చెప్పాలి. పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారో చెప్పాలి. చంద్రబాబు అరెస్ట్ తో జగన్ కు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబును జైల్లో పెట్టమని జగన్ చెప్పలేదు. కోర్టు చెప్పింది.

Also Read: చిత్తూరు జిల్లాలో మూడు సీట్లపై జనసేన గురి.. డైలమాలో టీడీపీ నేతలు!

జగన్ ఢిల్లీకి వెళ్లింది అందుకే..
రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో మాట్లాడతారు. పోలవరం, ఇతర నిధుల గురించి అందుబాటులో ఉన్న కేంద్రం పెద్దలను కలుస్తారు. రాష్ట్రానికి సంబంధించిన పలు రాజకీయ అంశాలపైనా కేంద్రహోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ మాట్లాడతారు. జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీది దుష్ప్రచారం.

రాత్రికి రాత్రి విదేశాలకు పారిపోయారు..
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే ఇప్పటికే ఈసీ ప్రాసెస్ స్టార్ట్ కావాలి కదా? స్కిల్ స్కామ్ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయి. చంద్రబాబు ఖాతాలోకే డబ్బులు వెళ్లాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆధారాల కోసం పెండ్యాల శ్రీనివాస్ ను విచారణ చేయాలని చూశారు. అయితే, పెండ్యాల శ్రీనివాస్ రాత్రికి రాత్రి విదేశాలకు పారిపోయారు. కిలారి రాజేశ్, పెండ్యాల శ్రీనివాస్ కు డబ్బులు ఇచ్చినట్లు గతంలో ఆధారాలున్నాయి.

Also Read: సైకిల్-గ్లాసు కాంబినేషన్‌పై కొత్త స్లోగన్.. బీజేపీపై పవన్ వైఖరి మారిందా?

కృష్ణా జలాల పంపకాల విషయం ఇప్పుడు తిరగదోడటం సరికాదు. కృష్ణా జలాల విషయంలో సాంకేతిక, న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తర్వాత మాట్లాడతాం. నిన్న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం నిలబడదని అంటున్నారు” అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.