Pawan Kalyan : డిప్యూటీ సీఎం ఆఫీస్ రీ మోడలింగ్.. పవన్ కి నచ్చినట్టు.. ఎవరు చేసారో తెలుసా?

అంతకుముందు గత ప్రభుత్వం వాడిన ఆ ఆఫీస్ ని పవన్ కళ్యాణ్ కి నచ్చినట్టు రీ మోడలింగ్ చేశారు.

Pawan Kalyan : డిప్యూటీ సీఎం ఆఫీస్ రీ మోడలింగ్.. పవన్ కి నచ్చినట్టు.. ఎవరు చేసారో తెలుసా?

Pawan Kalyan Deputy CM Office Remodeling by Art Director Anand Sai

Updated On : July 21, 2024 / 11:27 AM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదాలో ఆఫీస్ కూడా కేటాయించగా తన ఆఫీస్ నుంచి పనులు చేస్తున్నారు. అయితే అంతకుముందు గత ప్రభుత్వం వాడిన ఆ ఆఫీస్ ని పవన్ కళ్యాణ్ కి నచ్చినట్టు రీ మోడలింగ్ చేశారు. పవన్ కి నచ్చినట్టు రీ మోడలింగ్ చేసింది పవన్ క్లోజ్ ఫ్రెండ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి.

తొలిప్రేమ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా చేసిన ఆనంద్ సాయితో పవన్ కళ్యాణ్ కి మంచి స్నేహం కుదిరి వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారని తెలిసిందే. అప్పట్నుంచి కూడా ఆనంద్ సాయి పవన్ వెంట ఉన్నారు. తాజాగా ఆనంద్ సాయి ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఆఫీస్ గురించి మాట్లాడుతూ.. పవన్ ఆలోచనలు, అభిరుచి మేరకు నేనే ఆయన డిప్యూటీ సీఎం ఆఫీస్ ని రీ మోడలింగ్ చేశాను. పవన్ కళ్యాణ్ కు లైట్ కలర్స్ అంటే ఇష్టం. అందుకే ఆఫీస్ లోపల అంతా లైట్ కలర్స్ వేశాం. ఆఫీస్ లో ఫర్నిచర్ ని ఫ్యాబ్రిక్ తో చేసాం. ఆఫీస్ ని పవన్ కి నచ్చేలాగా, అక్కడకు వచ్చే ప్రజలకు అనుకూలంగా ఉండేలా డిజైన్ చేసాము అని తెలిపాడు.

Also Read : Kalki 2898AD : కల్కి నిర్మాతలకు షాక్.. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ లీగల్ నోటీసులు..

అలాగే.. పవన్ ఇంత భారీ మెజార్టీతో గెలిచి డిప్యూటీ సీఎం అయినా తొలిప్రేమ సినిమా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయనలో కొంచెం కూడా గర్వం లేదు. అప్పుడు ఇప్పుడు అంతే వినయంగా ఉన్నారు అని తెలిపారు.