Pawan Kalyan: నా రెండు చెప్పులు కొట్టేశారు, ఎవరో దొంగిలించారు: పవన్ కామెంట్స్
ఎవరికైనా కనిపిస్తే పట్టుకోండని, తన చెప్పులు తనకు ఇప్పిచండి ప్లీజ్ అని అన్నారు.
- T Venkateshwarlu
- Published On : June 16, 2023 / 09:28 PM IST
Pawan Kalyan
Pawan Kalyan – JanaSena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రెండు చెప్పులు కొట్టేశారని, ఎవరో దొంగిలించారని వ్యాఖ్యానించారు. ఎవరికైనా కనిపిస్తే పట్టుకోండని, తన చెప్పులు తనకు ఇప్పిచండి ప్లీజ్ అని అన్నారు. వైసీపీ (YCP) ప్రభుత్వం గుడిలో తన చెప్పులు కూడా పట్టుకుని వెళ్లిపోతుందని చురకలు అంటించారు.
ఇవాళ కాకినాడ(Kakinada)లోని పిఠాపురంలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర(Varahi Vijaya Yatra)లో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
తనను దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని గతంలో పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే, దీనిపై ఇటీవల పవన్ స్పందిస్తూ.. దశాబ్దాలుగా ఉన్న పార్టీలు కూడా వైసీపీ నాయకులకు బయపడితే మనం చెప్పు తీసి చూపించాం, అది మన బలం అని అన్నారు.
దీనిపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఇటీవల రెండు చెప్పులూ చూపిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ ఇవాళ తన రెండు చెప్పులు పోయాయని చురకలంటించారు.
కాగా, గూండాగాళ్ల కాళ్లు విరగ్గొడతానని పవన్ కల్యాణ్ చెప్పారు. నేరగాళ్ల అడ్డాగా ఏపీ మారిందని పవన్ అన్నారు. ఎంపీ కుటుంబ రక్షణకే దిక్కులేకుండాపోయిందని తెలిపారు. వైసీపీ వల్ల ఏపీలో మత్తు జోగుతుందని చెప్పారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని సీఎం పరిపాలించడానికి సిద్ధమని అన్నారు.
Pawan Kalyan: జనసేన ప్రభుత్వం వస్తే మొట్టమొదటిగా ఈ పనే చేస్తాం: పవన్ కల్యాణ్
