Pawan Kalyan: జనసేన ప్రభుత్వం వస్తే మొట్టమొదటిగా ఈ పనే చేస్తాం: పవన్ కల్యాణ్

అమ్మవారి సాక్షిగా ఓ విషయం చెబుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan: జనసేన ప్రభుత్వం వస్తే మొట్టమొదటిగా ఈ పనే చేస్తాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan – Janasena: వేదాలు తీసుకువచ్చిన బ్రాహ్మణ సమాజానికి నమస్కారమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మనస్ఫూర్తిగా వారిని ధన్యవాదాలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు. కాకినాడ(Kakinada)లోని పిఠాపురం(Pithapuram)లో ఆయన వారాహి విజయ యాత్ర(Varahi Vijaya Yatra)లో పాల్గొని మాట్లాడారు.

అందరినీ సమానంగా చూసి ధర్మాన్ని మన దేశం చెప్పిందని తెలిపారు. ఇటువంటి నేలలో మనం ఉన్నామని, అయితే, పిఠాపురం వస్తున్నాంటూ తనకు మొదట ఇక్కడ జరిగిన విగ్రహాల ధ్వంసం ఘటనలు గుర్తుకువచ్చాయని చెప్పారు. హిందూ దేవాలయాల విషయంలో జరుగుతున్న దాడి గుర్తుకువచ్చిందని తెలిపారు. తాను మతపిచ్చి ఉన్నవాడిని కాదని అన్నారు.

హిందువులకు కోపం తెప్పించే పనులు చేయొద్దని చెప్పారు. ఇది శాంతి భద్రతల విషయమని అన్నారు. జనసేన ప్రభుత్వం వస్తే మొట్టమొదటిగా శాంతి భద్రతలను కట్టుదిట్టం చేస్తామని తెలిపారు. శాంతి భద్రతలు బాగుంటే అన్ని సవ్యంగా ఉంటాయని చెప్పారు.

Pawan Kalyan


Pawan Kalyan

తన కడ శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే ఎవరినీ బతకనివ్వదని చెప్పారు. నేరచరిత్ర ఉన్న వారు మనలను పరిపాలిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ఏపీని విడిచి వెళ్లనని అమ్మవారి సాక్షిగా చెబుతున్నానని తెలిపారు.

కాకినాడ ఎమ్మెల్యేలాగా చేయొద్దని అన్నారు. ఆయన గురించి ఎక్కువగా మాట్లాడాలని తాను అనుకోవడం లేదని చెప్పారు. కాగా, వారాహి యాత్రకు బయలుదేరడానికి ముందు పిఠాపురం పట్టణానికి చెందిన దత్త ఉపాసకుడు శ్రీ లక్ష్మీనారాయణ దత్తు ఆధ్వర్యంలోని వేద పండితుల నుంచి పవన్ కల్యాణ్ ఆశీర్వచనం తీసుకున్నారు.

Harish Rao Thanneeru : దేశ పటంలో సిద్దిపేట స్థానాన్ని నిలపబోతున్నాం- మంత్రి హరీశ్ రావు