Janasena Party : వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు.. ఆహ్వానించిన పవన్ కల్యాణ్

అధికార వైసీపీకి చెందిన పలువురు నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో శనివారం జనసేన పార్టీలో చేరారు.

Pawan Kalyan

Pawan Kalyan: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ముఖ్యనేతలు జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నేను ఏదైనా మాటల్లో చెప్పను.. నిలబడి చేసి చూపిస్తానని అన్నారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డామని, కార్యకర్తలకు అండగా ఉంటూ వచ్చామని అన్నారు.

ఒక కులాన్ని ఆధారం చేసుకుని పాలిలిటిక్స్ చేయలేమని పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన భావజాలం, లెఫ్ట్ భావజాలం అంటే ఇష్టమని.. రెండూ ఒక తాటిపైకి తేవాలన్నది తన ఉద్దేశమన్నారు. దాశరధి రంగాచార్య, కృష్ణమాచార్య కూడా సనాతన విధానాలు పాటించినా.. వామపక్ష విధానాలతో ఉద్యమించారని గుర్తు చేశారు. తాను ఇగోలకు వెళ్లలని, ఛాన్సులు తీసుకోదలచుకోలేదని.. ఏపీ ప్రజలు గెలవాలనుకుంటున్నానని చెప్పారు.

Also Read : టెన్షన్ టెన్షన్.. సీఆర్‌పీఎఫ్ బ‌ల‌గాల ఆధీనంలోకి సాగ‌ర్ డ్యామ్.. తెలంగాణ పోలీసులపై కేసు నమోదు

జనసేనలో చేరిన వారిలో.. చిలకలపూడి పాపారావు ( సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు – కృష్ణాజిల్లా), చిక్కాల దొరబాబు (తూర్పుగోదావరి వైసిపి నాయకులు), దుగ్గన నాగరాజ (తూర్పుగోదావరి వైసిపి నాయకులు), కలగ పాల్ పురుషోత్తం (తూర్పుగోదావరి వైసిపి నాయకులు), ఎదురువాక శ్రీ వెంకటగిరి (తూర్పుగోదావరి వైసిపి నాయకులు), పొగిరి సురేష్ బాబు (శ్రీకాకుళం జిల్లా వైసిపి నాయకులు), వై. శ్రీనివాస్ రాజు (కడప జిల్లా వైసిపి నాయకులు) ఉన్నారు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు