Rambabu
Minister Ambati Rambabu : పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో కమెడియన్ అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ హీరో అని పేర్కొన్నారు. పవన్ రాజకీయాల్లో రాణించలేకపోతున్నారని తెలిపారు. పశ్నించడానికే వస్తున్నానని చెప్పిన పవన్.. కేవలం వైసీపీనే ప్రశ్నిస్తారని వెల్లడించారు. టీడీపీ అధికారంలో ఉన్నా ప్రశ్నించరని చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అంబటి మీడియాతో మాట్లాడుతూ పవన్.. ముఖ్యమంత్రిగా 175 సీట్లలో పోటీ చేస్తావా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలోకి వెళ్ళడానికి పోటీయా? లేక చంద్రబాబును గెలిపించడానికా? అని నిలదీశారు. పవన్.. రాజకీయాలకు పనికిరాడని పేర్కొన్నారు. పొత్తుతో వెళ్తే పవన్ కళ్యాణ్ కు ఎందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రశ్నించారు.
AP Politics: వపన్ హీరోయిజం నుంచి జీరోయిజానికి వచ్చారు.. ‘ఒక్క ఛాన్స్’ రిమార్క్పై ఆర్జీవీ సెటైర్
నిజమైన రాజకీయాలు చేసే సత్తా పవన్ కు లేదని స్పష్టం చేశారు. పవన్ ను నడిపిస్తున్నది చంద్రబాబు అని ఆరోపించారు. పవన్ కు రాజకీయాలు తెలియవు అని ఎద్దేవా చేశారు. చెప్పుల రాజకీయాలు చేస్తున్నది పవన్ కళ్యాణ్ విమర్శించారు. జనసైనికులు, వీర మహిళలు మేలుకోవాలని సూచించారు.