AP Politics: వపన్ హీరోయిజం నుంచి జీరోయిజానికి వచ్చారు.. ‘ఒక్క ఛాన్స్’ రిమార్క్‭పై ఆర్జీవీ సెటైర్

‘‘కుల రాజకీయాలకు మేము స్వస్తి చెప్తాం. సమస్యలు చెబుతున్నారు తప్ప ఎలక్షన్ టైంలో వదిలేస్తున్నారు. ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో జనసేనను గెలిపించండి. దేశం మొత్తం చూసేలా పిఠాపురంను అభివృద్ధి చేస్తాము. పదేళ్లు జనసేనకి అధికారం కట్టబెట్టండి. రెండేళ్లు నా అధికారము నచ్చకపోతే నేనే రాజీనామా చేస్తాను” అని ధ్వజమెత్తారు.

AP Politics: వపన్ హీరోయిజం నుంచి జీరోయిజానికి వచ్చారు.. ‘ఒక్క ఛాన్స్’ రిమార్క్‭పై ఆర్జీవీ సెటైర్

RGV satire on Pawan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‭పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సెటైర్లు గుప్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన వారాహి యాత్రలో తనకు ముఖ్యమంత్రిగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను పవన్ కల్యాణ్ వేడుకున్నారు. ఈ వ్యాఖ్యల్ని ఉద్దేస్తూ ఒక్క ఛాన్స్‌ అంటూ పవన్ కన్నీళ్లతో అడుక్కుంటున్నారని, ఆయన హిరోయిజం ఇప్పుడు జిరోయిజానికి పడిపోయిందంటూ వర్మ సెటైర్ వేశారు.

AAP Offer to Congress: కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోటీ చేయమంటూ ప్రకటన

శుక్రవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆర్జీవీ స్పందిస్తూ ‘‘పవర్ స్టార్ కన్నీళ్లతో అడుక్కుంటూ తన హీరోయిజాన్ని తన అభిమానులు, కులస్థుల హృదయాల్లో జీరోయిజంగా మారుస్తున్నారు’’ అని ట్వీట్ చేశారు. పవన్ మీద ఆర్జీవీ ఇలా సెటైర్లు వేయడం ఇది కొత్తేం కాదు. వాస్తవానికి ఓ సినిమాలో జనసేనానికి ఒక దారంటూ లేదని విమర్శలు గుప్పించారు. ఇక ట్విట్టర్ ద్వారా అయితే తరుచూ ఏదో సందర్భాన్ని చూసుకుని సెటైర్లు వేస్తూనే ఉంటారు.

Earthquake jolts Bangladesh,Assam: అసోం, బంగ్లాదేశ్‌‌లను వణికించిన భూకంపం

గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆర్జీవీ స్పందిస్తూ ‘‘పవన్ కళ్యాణ్ గొప్ప ఎంటర్టైనర్. అందుకే నేను రాజకీయాల్లో అతని మాత్రమే అనుసరిస్తాను. నాకు పవన్ తప్ప రాజకీయాల గురించి ఏమీ తెలీదు’’ అని చేసిన అప్పట్లో నెట్టింట్లో మార్మోగింది. ఇక కొద్ది రోజుల క్రితం పాపం పసివాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద పవన్ చేసిన విమర్శలపై ఆర్జీవీ స్పందిస్తూ పవన్ అజ్ఞానంతో నిండిన అమాయకుడని, ఆ అమాయకుడితో కూడా ఈ సినిమాను ఎవరైనా చేస్తారని తాను భావిస్తున్నానని అన్నారు.

International Day: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి కేంద్ర కార్యాయలంలో యోగా చేయనున్న ప్రధాని మోదీ

ఇక గురువారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ ‘‘కుల రాజకీయాలకు మేము స్వస్తి చెప్తాం. సమస్యలు చెబుతున్నారు తప్ప ఎలక్షన్ టైంలో వదిలేస్తున్నారు. ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో జనసేనను గెలిపించండి. దేశం మొత్తం చూసేలా పిఠాపురంను అభివృద్ధి చేస్తాము. పదేళ్లు జనసేనకి అధికారం కట్టబెట్టండి. రెండేళ్లు నా అధికారము నచ్చకపోతే నేనే రాజీనామా చేస్తాను” అని ధ్వజమెత్తారు.