Earthquake jolts Bangladesh,Assam: అసోం, బంగ్లాదేశ్‌‌లను వణికించిన భూకంపం

అసోంతోపాటు పలు ఈశాన్యప్రాంతాలు, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. అసలే వరదలతో అల్లాడుతున్న అసోం రాష్ట్రంలో మళ్లీ శుక్రవారం ఉదయం 10.16 గంటలకు భూకంపం వచ్చింది.ఈ భూప్రకంపనలతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు....

Earthquake jolts Bangladesh,Assam: అసోం, బంగ్లాదేశ్‌‌లను వణికించిన భూకంపం

Earthquake

Earthquake jolts Bangladesh,Assam: అసోంతోపాటు పలు ఈశాన్యప్రాంతాలు, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. అసలే వరదలతో అల్లాడుతున్న అసోం రాష్ట్రంలో మళ్లీ శుక్రవారం ఉదయం 10.16 గంటలకు భూకంపం వచ్చింది.ఈ భూప్రకంపనలతో ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Assam flood: అసోం వరదల్లో 25 గ్రామాల ముంపు..29 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

అంతకుముందు జూన్ 11 వతేదీన అసోంలోని మధ్య భాగంలో రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారిక బులెటిన్ ధృవీకరించింది. గతంలో జమ్మూ కాశ్మీర్‌లోని దోడా, కత్రా ప్రాంతాల్లో మూడు సార్లు భూకంపాలు సంభవించాయి.

Hunter killed Drones: భారత మిలటరీ అమ్ముల పొదిలోకి హంటర్ కిల్లర్ డ్రోన్లు

బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న సోనిత్‌పూర్ జిల్లాలో భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదిక తెలిపింది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతంలోనూ సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.8గా ఉంది. బంగ్లాదేశ్ లో 70 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది.