Pawan Kalyan Video: ఏటిమొగకు పడవలో పవన్‌ కల్యాణ్‌.. బోటు ఎక్కి హగ్ ఇచ్చి నీళ్లలో దూకిన అభిమాని

పవన్ కల్యాణ్ ను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు. 

Pawan Kalyan

Pawan Kalyan Video – Kakinada: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని కాకినాడ జిల్లా ఏటిమొగకు పడవలో వెళ్లారు జనసేన (JanaSena) అధినేత పవన్‌ కల్యాణ్‌. మత్స్యకారులకు అభివాదం చేస్తూ బోటులో ముందుకు కదిలారు. మత్స్యకారుల ప్రాంతాలను పరిశీలించారు. ఆయన వెంట పలువురు స్థానిక జనసేన నాయకులు ఉన్నారు.

మత్స్యకారుల సమస్యలను పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. పవన్ కల్యాణ్ ను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.  పవన్ కల్యాణ్ పడవలో ఉండగా ఆయన వద్దకు ఈత కొడుతూ వచ్చిన ఓ అభిమాని.. ఆ బోటు ఎక్కి పవన్ కు హగ్ ఇచ్చాడు. అనంతరం అమితానందంతో ఆ అభిమాని పడవలో నుంచి నీళ్లలోకి దూకాడు. ఆ తర్వాత ఈదుకుంటూ వెళ్లిపోయాడు.

వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ కాకినాడలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. కాకినాడలో వైసీపీని ఓడిస్తామని జనసేన అంటోంది. ఏపీలో ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలు అందుకు ప్రచార ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

JanaSena: ద్వారంపూడిపై పోటీకి పవన్ కల్యాణ్ అవసరం లేదు.. ఈమె చాలు: జనసేన నేత దుర్గేశ్