Pawan Kalyan
Chandrababu Naidu oath taking ceremony : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11.33 గంటలకు ఆయన ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు వేదికపై ఆశీనులయ్యారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీకి గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు.
Also Read : Pawan Kalyan – Chiranjeevi : పవన్ ప్రమాణ స్వీకారం.. అన్నయ్య ఆనందం.. వీడియో తీస్తున్న భార్య..
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా ముగ్గురు నేతలు ప్రమాణ స్వీకారం సభా ప్రాంగణంకు చేరుకున్నారు. సభా వేదికపైకి ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో సభా ప్రాంగణం ఒక్కసారిగా పవన్ నామస్మరణతో మారుమోగిపోయింది. నిమిషం పాటు మోదీ, చంద్రబాబు, పవన్ నామస్మరణలతో సభాప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇదిలాఉంటే మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో మెగా అభిమానులు, జనసైనికులు పవన్ నామజపంతో ఊగిపోయారు.