Pawan Kalyan – Chiranjeevi : పవన్ ప్రమాణ స్వీకారం.. అన్నయ్య ఆనందం.. వీడియో తీస్తున్న భార్య..
పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ అంతా వచ్చిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan Taking Oath Cereemony Chiranjeevi Happy Tears Video goes Viral
Pawan Kalyan – Chiranjeevi : నేడు ఏపీలో ప్రమాణ స్వీకారం మహోత్సవం గ్రాండ్ గా జరిగింది. ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసారు. అనంతరం పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సభా ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది. పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ అంతా వచ్చిన సంగతి తెలిసిందే.
మెగా ఫ్యామిలీ అంతా పవన్ ప్రమాణ స్వీకారాన్ని ఆనందంతో తిలకించారు. ఇక చిరంజీవి స్టేట్ గెస్ట్ గా వేదిక పైనే కూర్చోగా పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు తమ్ముడిని చూస్తూ కూర్చున్నారు. ఆనందంతో పులకరించిపోయారు మెగాస్టార్. తమ్ముడు ప్రమాణ స్వీకారం చేసాక చప్పట్లతో అభినందనలు తెలియచేసారు. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు చిరంజీవిని గమనించిన వాళ్ళు అన్నదమ్ముల అనుబంధం అంటే ఇది అంటూ అభినందిస్తున్నారు.
Also Read : Pawan Kalyan : బాహుబలి సీన్ రిపీట్.. పవన్ కళ్యాణ్ అనే నేను.. దద్దరిల్లిన సభ ప్రాంగణం..
ఇక పవన్ భార్య అన్నా లేజనోవా కింద వీక్షకులలో కూర్చోగా పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే తన ఫోన్ లో వీడియో తీసుకుంది. ఇలా పవన్ ప్రమాణ స్వీకారం కన్నుల పండుగగా జరగగా పవన్ అభిమానులు, కార్యకర్తలు, మెగా అభిమానులు, మెగా ఫ్యామిలీ ఆనందంతో పొంగిపోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం వీడియో వైరల్ గా మారింది.
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను…#PawanKalyanAneNenu pic.twitter.com/jLKpg0z2mQ
— Trend PSPK (@TrendPSPK) June 12, 2024