Pawan Kalyan meets JP Nadda : తిరుపతి ఉప ఎన్నికపై చర్చించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే అంశంపై చర్చ జరిగినట్లు పేర్కొన్నారు. ఓ కమిటీ వేసి అభ్యర్థిని నిర్ణయిస్తామని చెప్పారు.
బుధవారం బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కళ్యాణ్ తోపాటు నాదేండ్ల మనోహర్ కూడా ఉన్నారు. 40 నిమిషాలపాటు సమావేశం కొనసాగింది.
తిరుపతి ఉప ఎన్నికపై కూడా చర్చ జరిగిందని.. బీజేపీ, జనసేన పార్టీలు మాట్లాడుకున్న తర్వాత ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. అతి త్వరలో నిర్ణయం ప్రకటించనున్నారు. ఉప ఎన్నిక కోసం కాదు…రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చామని తెలిపారు.
అమరావతి రాజధానిపై చర్చించామని చెప్పారు. చివరి రైతుకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని భరోసా ఇచ్చారు. పోలవరం అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందన్నారు. ఏపీకి సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగినట్లు వివరించారు.