పవన్ కల్యాణ్ నామినేషన్.. ఎన్నికోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

ఆదాయ పన్నుగా పవన్ రూ.47,07,32,875 కట్టగా, జీఎస్టీకి రూ.26,84,70,000 కట్టారు.

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ పిఠాపురం అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నామినేషన్ వేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అఫిడవిట్ లో పేర్కొన్న వివరాల ప్రకారం పవన్ ఐదేళ్ల సంపాదన రూ.114.76 కోట్లు, ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు రూ.73.92 కోట్లు, అప్పులు రూ.64.26 కోట్లుగా ఉన్నాయి.

ఆదాయ పన్నుగా పవన్ రూ.47,07,32,875 కట్టగా, జీఎస్టీకి రూ.26,84,70,000 కట్టారు. పలు సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల కోసం పవన్ విరాళాలు ఇచ్చారు. జనసేనకు మొత్తం రూ.17,15,00,000 విరాళంగా అందించారు.

కేంద్రీయ సైనిక్ బోర్డుకు రూ.1 కోటి, పీఎం సిటిజెన్ ఆసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్ కు రూ.1 కోటి, ఏపీ సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు, శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కు రూ.30,11,717, పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ కు రూ.2 లక్షలు ఇచ్చారు.

Also Read: బీఆర్ఎస్‌ గురించి కుండబద్దలు కొట్టిన గుత్తా సుఖేందర్ రెడ్డికి ధన్యవాదాలు: మంత్రి కోమటిరెడ్డి