Pawan Kalyan: ఏపీలో ఏ పథకమూ ఆగదు.. మేం మరింత ఇస్తాం.. అంతేకాదు..: పవన్ కల్యాణ్

తాను సొంత డబ్బులను పేదల కోసం ఖర్చు పెడుతున్నానని, అటువంటిది ప్రభుత్వంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ఎలా ఆపుతామని ప్రశ్నించారు.

Pawan Kalyan

జనసేన-టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే పథకాలు ఆపేస్తారంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మరింత సంక్షేం ఇచ్చేలా జనసేన-టీడీపీ వ్యవహరిస్తాయని స్పష్టం చేశారు. ప్రమాదవశాత్తూ చనిపోయిన క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను అందించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక మరింత ఇస్తాం తప్ప.. ఏదీ ఆపబోమని అన్నారు. డ్వాక్రా రుణాల మాఫీపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. డ్వాక్రా రుణాల మాఫీపై టీడీపీతో చర్చిస్తున్నామని తెలిపారు. మోసం చేసే కంపెనీలకు బ్యాంకులు రుణాలిచ్చి వదిలేస్తున్నాయని మండిపడ్డారు.

డ్వాక్రా మహిళలకు ఏ విధంగా రుణ మాఫీ చేయాలనే అంశంపై ఆలోచిస్తున్నామని పవన్ కల్యాణ్ చెప్పారు. జనసేన-టీడీపీ ప్రభుత్వం మరింత సంక్షేమం అందిస్తుందని తెలిపారు. తాను సొంత డబ్బులను పేదల కోసం ఖర్చు పెడుతున్నానని, అటువంటిది ప్రభుత్వంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ఎలా ఆపుతామని ప్రశ్నించారు.

కాగా, చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు చెక్కులిచ్చే సందర్భంలో బాధేస్తోందని, వారికి రూ. 5 లక్షలు పెద్ద మొత్తం కాదని, కానీ వారికి కాస్తో కూస్తో చేయూతనిస్తోందని తెలిపారు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నామన్నారు. జనసేనకు మానవతా ధృక్పథం ఉందని, అధికారం కూడా తోడైతే ఇంకా బాగుంటుందని తెలిపారు.

రాజధాని లేదు, పరిశ్రమలూ లేవు.. ఇదేనా వైఎస్ఆర్ పాలన అంటే? సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల ఫైర్