ఎన్నికల వేళ జనసేన నేతలతో పవన్ కల్యాణ్‌ సమావేశం

Pawan Kalyan: మరో రెండు రోజుల్లో తమ పార్టీ మిగతా అభ్యర్థులను ఖరారు చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు.

ఎన్నికల వేళ జనసేన పెండింగ్‌ స్థానాలపై ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కసరత్తు చేస్తున్నారు. అవనిగడ్డతో పాటు పాలకొండ, విశాఖ అసెంబ్లీ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే, మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానాన్ని పవన్ కల్యాణ్ పెండింగ్‌లో ఉంచారు.

ఆయా నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో పవన్‌ కల్యాణ్‌ అమరావతిలో సమావేశమై చర్చించారు. విజయవాడ పశ్చిమ సీటు కోసం పవన్‌ కల్యాణ్‌ను జనసేన నేత పోతిన మహేశ్ కలిశారు. మరికొందరు నేతలు పవన్ కల్యాణ్ ను కలిశారు.

మరో రెండు రోజుల్లో తమ పార్టీ మిగతా అభ్యర్థులను ఖరారు చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. 30వ తేదీన పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల విషయంపై తుది నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

CM Jagan : షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు