AP Govt : ఏపీలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15వేలు పడేది ఆ రోజే.. అర్హుల లెక్క తేలింది.. ఎంతమంది అంటే..

AP Govt : రాష్ట్రంలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఆటోమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది.

AP Govt : ఏపీలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15వేలు పడేది ఆ రోజే.. అర్హుల లెక్క తేలింది.. ఎంతమంది అంటే..

AP Govt

Updated On : September 26, 2025 / 12:54 PM IST

AP Govt : రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లను ఆర్థికంగా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఆటోమిత్ర పథకాన్ని అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ గాంధీ జయంతి రోజున రూ.15వేల చొప్పున బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నగదు జమచేసి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

Also Read: AP Rains : దూసుకొస్తున్న వాయుగుండం.. ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. బయటకు రావొద్దు..

ఆటోమిత్ర పథకంలో భాగంగా అర్హులైన వారి నుంచి ఈనెల 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. గతంలో వాహన మిత్ర ద్వారా ఈ పథకంలో కొనసాగుతున్నవారు కాకుండా.. కొత్తవారు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈ పథకం కోసం మొత్తం 3,10,385 మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2వ తేదీన అర్హుల ఖాతాల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వారి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు.

రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీశక్తి పథకాన్ని ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని వల్ల తమకు నష్టం వస్తోందని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ అంశంపై స్పందించిన సీఎం చంద్రబాబు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రతీయేటా రూ.15వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.466 కోట్ల భారం పడుతుంది.

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ప్రతియేటా రూ.10వేలు అందించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని ఆటోమిత్రగా మార్చి.. ప్రతీయేటా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేలు చెల్లించనుంది.