Amalapuram : అమలాపురంలో హైఅలర్ట్.. పవన్ బహిరంగ సభతో ప్రధాన సెంటర్లలో పోలీసుల భారీ బందోబస్తు

Amalapuram : ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముందు జాగ్రత్తగా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు.

Amalapuram (Photo : Twitter)

Amalapuram – Pawan Kalyan : అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. అమలాపురం ప్రధాన సెంటర్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమలాపురం అల్లర్లు దృష్టిలో పెట్టుకుని భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేశారు.

Also Read..Pawan Kalyan : మనలో ఐక్యత లేకపోతే మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది, ఒక్కసారి నన్ను నమ్మండి- పవన్ కల్యాణ్

సాయంత్రం గడియారం స్థంభం సెంటర్ లో పవన్ బహిరంగ సభ ఉంటుంది. తన ఎన్నికల ప్రచార రథం వారాహి మీద నుంచి ప్రసంగించనున్నారు పవన్ కల్యాణ్. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముందు జాగ్రత్తగా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. పోలీసులు భారీగా మోహరించారు.

కోనసీమ జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. అభిమానులు, కార్యకర్తలు పవన్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు. గురువారం అమలాపురంలో బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. సాయంత్రం స్థానిక గడియార స్తంభం సెంటర్ దగ్గర సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. కోనసీమ వాసులు వారాహి యాత్ర‌కు నీరాజ‌నం పడుతున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర విజయవంతంగా సాగుతోంది. కాకినాడ జిల్లా లో యాత్ర ముగించుకుని కోనసీమ జిల్లాలోకి ఎంటర్ అయ్యారు పవన్. వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు పవన్ కల్యాణ్.