Pawan Kalyan : మనలో ఐక్యత లేకపోతే మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది, ఒక్కసారి నన్ను నమ్మండి- పవన్ కల్యాణ్

Pawan Kalyan : 100 మంది ట్యాక్స్ లు కడితే వాళ్ళ కష్టాన్ని 30మందికి ఇచ్చి ఓట్లు సంపాదించుకుంటున్నారు.

Pawan Kalyan : మనలో ఐక్యత లేకపోతే మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది, ఒక్కసారి నన్ను నమ్మండి- పవన్ కల్యాణ్

Pawan Kalyan (Photo : Twitter)

Pawan Kalyan – YSRCP : వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. మనలో ఐక్యత లేకపోతే మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయయాత్ర కోనసీమ జిల్లాలో అడుగుపెట్టింది. ముమ్మిడివరంలో బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాలు చెప్పడానికి దస్త్రాలు దస్త్రాలు ఉన్నాయన్నారు. కోనసీమ కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర లేదని పవన్ వాపోయారు.

”ముమ్మిడివరాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి జీఎంసీ బాలయోగి. ఆయన ఒక్కడు తలుచుకుంటే ఇంత అభివృద్ధి చేయగలిగారు. ఒక నాయకుడు పూనుకుంటే ఏదైనా సాధ్యమే. ఉభయ గోదావరి జిల్లాలకి, కోనసీమ ప్రాంతానికి జనసేన పవన్ కళ్యాణ్ అండగా ఉంటాడని మాటిస్తున్నా. పాలిటిక్స్ నాకు రిటైర్ మెంట్ ప్లాన్ కాదు. 30ఏళ్ల వయసు దాటగానే రాజకీయాల్లోకి వచ్చాను. 2008 నుంచి పాలిటిక్స్ లో ఉన్నా.

కోనసీమకు రావాలంటే నాకు భయంగా ఉంది. ఎంత ప్రేమ ఉందో అంత కోపం ఉంది. ఈ నేలలో పండించిన తిండి తింటే ఉద్వేగం ఉంటుంది. 100 మంది ట్యాక్స్ లు కడితే వాళ్ళ కష్టాన్ని 30మందికి ఇచ్చి ఓట్లు సంపాదించుకుంటున్నారు. మనలో ఐక్యత లేకపోతే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది.

Also Read.. Amadalavalasa Constituency: ఆమదాలవలసలో మామ మరోసారి జెండా ఎగరేస్తారా.. అల్లుడు చక్రం తిప్పుతాడా?

ప్రభుత్వం.. కులాల మధ్య చిచ్చు పెడుతోంది:
సమాజంలో పెరిగిపోతున్న పిరికితనంపైనే నా పోరాటం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టడానికి పార్టీ పరంగా మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వం ఇరువర్గాల మధ్య సానుకూల వాతావరణంలో సర్ది చెప్పాలి. గొడవలు జరుగుతాయని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా నాకు తెలిసింది. వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతోంది. కాపులకు, శెట్టి బలిజల మధ్య జనసేన సానుకూల పరిస్థితులను తీసుకురావడానికి కృషి చేసింది.

కొబ్బరికే కాదు ఆంధ్రాకు వైసీపీ అనే తెల్లదోమ వైరస్ పట్టింది:
ద్వారంపూడి కుటుంబీకులకు నేను వ్యతిరేకిని కాదు. రైతులు కన్నీరు తుడుస్తాను అంటే మీ భుజం తట్టి ప్రోత్సహిస్తాను. నా రక్షణ నా తల్లి వారాహి చూసుకుంటుంది. నాకు అండగా నిలబడితే నిజమైన రైతుభరోసా కేంద్రాలను తీసుకొస్తాను. రాజకీయం చేయాలంటే పెట్టి పుట్టాలి అంటారు. నాకు ధైర్యం ఉంది. కొబ్బరికే కాదు ఆంధ్రాకు వైసీపీ అనే తెల్లదోమ వైరస్ పట్టింది. ఒక్కసారి పవన్ మీ వాడు అనుకోండి. జనసేన మీ పార్టీ అనుకోండి. జనసేన, పవన్ పై నమ్మకం పెట్టండి. ఆంధ్రా బాగుండాలంటే ఎవరి కులాన్ని వారు గౌరవించుకోవాలి” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read..Pawan Kalyan Vs YCP : పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ కాపు లీడర్స్.. ఏపీ రాజకీయాల్లో పెరిగిన హీట్

ప్రభాస్, మహేశ్, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ పై హాట్ కామెంట్స్:
సినిమాల మీద ఉన్న ఇష్టాన్ని రాజకీయాలపై చూపించకండి అని ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశారు పవన్ కల్యాణ్. సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని ఆయన తేల్చి చెప్పారు. ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్, రాంచరణ్ పేర్లు ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. ప్రభాస్, మహేష్ నాకంటే పెద్ద హీరోలు అని పవన్ అన్నారు. జూ.ఎన్టీఆర్, రాంచరణ్ గ్లోబల్ హీరోలు అని చెప్పారు.