Pawan Kalyan
Pawan Kalyan: ఏపీలో ఆ మూడు పార్టీలు కలవడానికి..పవర్‌లోకి రావడానికి..కూటమి లాంగ్ లీవ్ స్లోగన్ బలంగా వినపడానికి ఆయనే కారణం. జనం మెచ్చిన నేతగా..హైందవ సేనానిగా..మీరా మీరా మీసం తెప్పే భగత్‌సింగ్‌లాగా..ఏపీ పాలిటిక్స్‌లో నిత్యం ఓ వెలుగు వెలుగుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆయన ఏం మాట్లాడిన..ఏ అంశం మీద రియాక్ట్ అయిన చర్చనీయాంశమే. లేటెస్ట్‌గా తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్‌పై పవన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
శ్రీవారి లడ్డూ కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి సంబంధించిందన్న పవన్..దర్యాప్తులో బయటపడుతున్న అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ అనేది హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుందని..సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిందే అంటూ మరోసారి వాయిస్ రేజ్ చేశారు. తిరుపతి లడ్డూ కేవలం తీపి పదార్థం కాదని..అది ఒక భక్తి భావన, ఆధ్యాత్మిక భావోద్వేగం అంటూ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. లడ్డూ కానీ తిరుమల పవిత్రతను కానీ కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు పవన్. (Pawan Kalyan)
తిరుమల లడ్డూ ఇష్యూపై దర్యాప్తు స్పీడప్ అయింది. కీలక వ్యక్తుల దర్యాప్తు వేళ..పవన్ ట్వీట్ చేయడం సమ్‌థింగ్ స్పెషల్‌గా మారింది. అయితే తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్ అందరి వేళ్లు..అప్పటి ప్రభుత్వంపై, గత టీడీపీ పాలకులవైపే చూపిస్తున్నాయి. ఓవైపు సిట్ టీమ్ దర్యాప్తు డిటేయిల్స్..న్యూస్ హెడ్‌లైన్‌గా మారగా..వైసీసీ కార్నర్ అవుతోంది. ఇప్పటికే అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి విచారణకు హాజరవగా..టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సిట్ నుంచి పిలుపురావడం కలకలం రేపుతోంది.
సేమ్‌టైమ్ ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారి వాంగ్మూలం ఇచ్చారన్న ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇదే టైమ్‌లో పవన్ రియాక్ట్ అవడం అంటే..గత ప్రభుత్వంపై మరోసారి అటాక్‌కు దిగినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. హిందుత్వ ఎజెండాతోనే పవన్ ట్వీట్ చేసినా..అది పూర్తిగా వైసీపీ తీరును ఎండగట్టేలా..హిందువుల మనసు గెలుచుకునేలా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఇప్పటికే వరుస కేసులు, నేతల అరెస్టులతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. లేటెస్ట్‌గా నకిలీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు. ఇక తర్వాత ఎవరు అనే చర్చ మొదలైంది. అయితే ఈసారి వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరును ప్రస్తావిస్తున్నారు కూటమి నేతలు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెద్దిరెడ్డిని గట్టిగానే టార్గెట్ చేశారన్న ప్రచారం సాగుతోంది.
పెద్దిరెడ్డి లెక్కలన్నీ ఇప్పుడు తీస్తారా?
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఆక్రమించిన అటవీ భూముల ఫొటోలను తీసినట్లు మొన్న క్యాబినెట్ భేటీలో చెప్పుకొచ్చారు. పెద్దిరెడ్డి లెక్కలన్నీ తీస్తున్నామని కూడా పవన్ అన్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ ఎవరిపై వ్యక్తిగతంగా టార్గెట్ చేయరు. కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్దిరెడ్డిని నిన్ను వదలా అంటున్నారు.
నిజానికి పెద్దిరెడ్డి, చంద్రబాబుకు మధ్య ఏళ్ల నాటి వైరం ఉందంటారు. కానీ సీబీఎన్ రాజకీయ ప్రత్యర్థిపై పవన్ ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది. 2024 ఎన్నికల్లో పిఠాపురంలో పవన్‌ను ఓడించేందుకు పెద్దిరెడ్డి ఫ్యామిలీ..ఎస్పెషల్‌గా ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నం చేశారని గుర్తు చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ మిథున్‌రెడ్డి పేరును ప్రస్తావించారు. ఆ తర్వాత పవన్ గెలిచారు. కూటమి అధికారంలోకి వచ్చింది. ఏరి కోరి అటవీ శాఖను తీసుకున్నారు పవన్. పెద్దిరెడ్డి లెక్క తేల్చడానికి పవన్ అటవీశాఖను తీసుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఆ ప్రచారానికి తగ్గట్టుగా ఇప్పుడు దూకుడు కనిపిస్తోంది. ఇలా ఆల్ రౌండర్‌గా టీమ్ కూటమిని ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉంచుతున్నారు సేనాని. ఆయన దూకుడు..అంతకు మించి వ్యూహం..కూటమికి ఇంకెంత అడ్వాంటేజ్‌గా మారుతుందో చూడాలి మరి.