Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు.. వాలంటీర్లపై అధ్యయనం చేశా: పవన్ కల్యాణ్

జనసేనలో సీట్ల కోసం ఇప్పటివరకు ఎవరూ డబ్బులు అడగలేదని, ఇక ముందు కూడా అడగబోరని చెప్పారు.

Pawan Kalyan – JanaSena: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ముందస్తు ఎన్నికలు జరిగే పరిణామాలు కనిపిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ జనసేన నేతలతో ఆయన సమావేశంలో పాల్గొన్నారు. తన చుట్టూ తిరిగితే నాయకులు కాలేరని, జనం చుట్టూ తిరగాలని ఆయన సూచించారు.

జనసేనలో సీట్ల కోసం ఇప్పటివరకు ఎవరూ డబ్బులు అడగలేదని, ఇక ముందు కూడా అడగబోరని పవన్ కల్యాణ్ చెప్పారు. ఒకవేళ తన పేరు, జనసేన పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూల్ చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. పాదయాత్రలు చేసినంత మాత్రాన సీఎంలు అయిపోయారని చెప్పారు. రోడ్లపై వెళ్తుంటే తనకు చాలా కష్టమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు.

స్థానికులు అందరూ అభిమానంతో నలిపేస్తారని, ముందుకు అడుగులు వెయ్యలేని పరిస్థితులు వస్తుంటాయని పవన్ కల్యాణ్ చెప్పారు. జనసేన సభకు రూపాయి పెట్టుబడి లేకుండా వేలాది మంది వస్తున్నారని అన్నారు. తాను వాలంటీర్ వ్యవస్థ గురించి రెండేళ్లుగా అధ్యయనం చేస్తున్నానని చెప్పారు. అందుకే అంత సమర్థంగా మాట్లాడగలిగానని తెలిపారు.

ఇంకా ఏమన్నారు?

జనసేన షణ్ముఖ వ్యూహాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లండి

పదవులు ఆశించకుండా పని చేసేవాళ్లు మన పార్టీలో వేలల్లో ఉన్నారు

తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ పార్టీకోసం పని చేసేవారు ఉన్నారు

ఏపీ అభివృద్ధి తెలంగాణకు చాలా అవసరం

అక్కడి యువతకు ఉపాధి రావాలంటే.. ఇక్కడ అభివృద్ది జరగాలి

అందుకే అంధ్రాకు పూర్తిగా మకాం మార్చాను

జగన్ లాంటి రాక్షస పాలన నుంచి ఏపీకి విముక్తి కలిగించాలి

త్యాగాలు నేను చేస్తా.. నాయకులంతా పార్టీ కోసం పని చెయ్యండి

కేసులు పెట్టుకుంటే నాపై పెట్టుకుంటారు.. పెట్టుకోనివ్వండి

జగన్ అధికారం వదులుకోవడానికి సిద్ధంగా ఉండడు.. మనమే లాక్కోవాలి

Chandrababu Naidu: చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ అధినేత

ట్రెండింగ్ వార్తలు