“వైసీపీ పాలనలో 30,000 మందికి పైగా మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారు” అంటూ పవన్ ట్వీట్

"హోంమంత్రి అనిత నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ పోలీసులకు, హోం మంత్రిత్వ శాఖకు నా హృదయపూర్వక అభినందనలు" అని పవన్ పేర్కొన్నారు.

Pawan Kalyan

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లాలో పోలీసులు 18 మంది అమ్మాయిల మిస్సింగ్‌ కేసును ఛేదించారంటూ వచ్చిన వార్తను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వానికి, నేటి కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ఆయన వివరించారు.

“వైసీపీ పాలనలో 30,000 మందికి పైగా మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారు. చర్యలు తీసుకోకపోవడమేకాదు.. వైసీపీ ప్రభుత్వం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. కానీ, ఇప్పుడు మార్పు వచ్చింది. ఏపీలో పటిష్ఠమైన లా అండ్ ఆర్డర్‌కి ఎన్డీఏ హామీ ఇచ్చింది.

విజయవాడ స్పెషల్ టాస్క్ ఫోర్స్ తాజాగా పలు కేసులను ఛేదించేందుకు ఇవాళ నేను గర్వపడుతున్నాను. హోంమంత్రి అనిత నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ పోలీసులకు, హోం మంత్రిత్వ శాఖకు నా హృదయపూర్వక అభినందనలు.

చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని మన ప్రభుత్వం మహిళల భద్రతకు భరోసా ఇవ్వడంలో పోలీసు శాఖకు పూర్తిగా మద్దతుగా ఉంటుందని హామీ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పౌరులు యాక్టివ్‌గా, అప్రమత్తంగా ఉండి, మన గ్రామాలు, పట్టణాలు, నగరాలను సురక్షితంగా, మరింత భద్రంగా మార్చడానికి సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

G20 Summit: ప్రపంచ అధినేతల ఫొటోలో జో బైడెన్‌ ఫొటో మిస్సింగ్‌