G20 Summit: ప్రపంచ అధినేతల ఫొటోలో జో బైడెన్‌ ఫొటో మిస్సింగ్‌

అధికారిక ఫొటోలో బైడెన్‌ కనపడకపోవడంతో దీనిపై అమెరికా అధికారులు స్పందించారు.

G20 Summit: ప్రపంచ అధినేతల ఫొటోలో జో బైడెన్‌ ఫొటో మిస్సింగ్‌

Updated On : November 19, 2024 / 2:35 PM IST

బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరుగుతున్న జీ20 సదస్సులో ప్రపంచ అధినేతలు ఫొటో దిగారు. అయితే, ఈ అధికారిక ఫొటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (81) లేరు. దీంతో ఆయన ఇకపై ప్రపంచాధినేతలతో ఫొటో దిగబోరన్న విషయంపై స్పష్టత వచ్చేసిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.

అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు నెలల్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజాగా, జీ20 సదస్సులో ప్రపంచ అధినేతలు ఫొటో దిగగా.. మొదటి రోలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాతో పాటు మరికొందరు దేశాధినేతలు ఉన్నారు.

అధికారిక ఫొటోలో బైడెన్‌ కనపడకపోవడంతో దీనిపై అమెరికా అధికారులు స్పందించారు. ఇది “లాజిస్టికల్ సమస్య” అని అన్నారు. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోతో చర్చలు జరిపి బైడెన్ వెళ్తున్న సమయంలో మరోవైపు, దేశాధినేతల ఫొటోను చాలా త్వరగా తీశారని చెప్పారు. ఫొటోను త్వరగా తీసిన నేపథ్యంలో బైడెన్‌తో పాటు మరికొందరు నేతలు కూడా మిస్‌ అయ్యారని అన్నారు. కాగా, ఈ ఫొటోలో ట్రూడో, ఇటలీ ప్రధాని మెలోనీ కూడా కనపడడం లేదు.

Patnam Narender Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట