Pawan Kalyan: జగన్ వీటి గురించి అర్థం చేసుకోకపోతే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి: పవన్

ఓయీ మానవుడా.. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు అని పేర్కొన్నారు.

Pawan Kalyan

Pawan Kalyan – Amalapuram: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) పాలనలో రాష్ట్రంలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి (Jandyala Papayya Sastry) రాసిన పుష్ప విలాపం చదవకపోతే, జగదీశ్ చంద్రబోస్ (Jagadeesh chandrabose) మొక్కలపై చేసిన ప్రయోగాల గురించి ఏపీ సీఎం జగన్ అర్థం చేసుకోకపోతే ఏం జరుగుతుందో చెప్పారు పవన్.

ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం చెట్లను కొట్టేసిన ఫొటోలను ఈ సందర్భంగా పవన్ పోస్ట్ చేశారు. పుష్ప విలాపంలో జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన కవితను పోస్ట్ చేశారు. ‘‘ ఓయీ మానవుడా.. బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి. అందమును హత్య చేసెడి హంతకుండా.

మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ.. అని దూషించు పూలకన్నియల కోయలేక వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని.. నాపై నీ కరుణశ్రీ రేఖలను ప్రసరింపుము ప్రభు.. ప్రభూ… ’’ అని అందులో ఉంది.

కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారని విమర్శించారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారని అన్నారు. ఏపీలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలని చెప్పారు. కోనసీమ కొబ్బరిచెట్ల ఫొటోలను కూడా పవన్ పోస్ట్ చేశారు.

Dhulipalla Narendra Kumar: అందుకోసమే సీఎం జగన్ పోరాటం చేస్తున్నారు: టీడీపీ నేత ధూళిపాళ్ల