Pawan Kalyan (Image Credit To Original Source)
Pawan Kalyan: లీడర్లు వస్తుంటారు.. పోతుంటారు.. ఎన్నో పార్టీలు వస్తుంటాయి.. కొన్ని నిలబడ్డాయి.. మరికొన్ని కనుమరుగు అయ్యాయి. ప్రాంతీయ పార్టీల మనుగడ అయితే వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. బట్ జనసేన అలా కాదు. సమ్‌థింగ్ డిఫరెంట్..తమ రూటే సెపరేటు అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ స్ట్రాంగ్ ఓ నమ్మకం మీదే ఉంటూ వస్తున్నారు. 20 ఏళ్లు పోరాడడానికి కూడా సిద్ధం. కానీ వన్స్ వి స్టెప్ ఇన్..పాతుకు పోతామంటూ చెప్పుకొచ్చారు. ఎవరి మీదో ఆధారపడి..ఏ పార్టీ నుంచో లీడర్లు వస్తారని..ఆశపడట్లేదు. నాయకులు ఎక్కడి నుంచో రారు. కార్యకర్తలనే లీడర్లుగా తీర్చిదిద్దుతామంటున్నారు.
ఇదే విషయంపై గత కొన్ని రోజులుగా సీరియస్ ఫోకస్ పెట్టారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 21 అసెంబ్లీ, ఇద్దరు ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు మంత్రులు, పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లతో బలంగా ఉన్న పార్టీని రానున్న రోజుల్లో మరింత బలోపేతం చేయాలని ఫిక్స్ అయిపోయారు. కూటమిలో భాగస్వామ్యంగా ఉంటూనే సొంతంగా బలపడేందుకు వ్యూహ రచన చేస్తున్నారు.
Also Read: బంగారం, వెండి ధరలకు కళ్లెం వేస్తారా? కేంద్ర బడ్జెట్‌లో ఏం జరగనుంది?
అధికారం, విపక్షం అన్న తేడా లేకుండా.. రోల్ ఏదైనా పది కాలాల పాటు పార్టీ నిలబడాలని కలలు కంటున్నారు పవన్. ఇందుకోసం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పటిష్టతపై ఫోకస్ పెట్టి..పార్టీ కమిటీలు నియామక ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం నాటికి కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టారు.
పార్టీలో జరుగుతున్న కొన్ని అంతర్గత సంఘటనలపైనా పవన్ దృష్టి పెట్టారట. వీటిపై తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై జనసేన నేతలతో ఇటీవలే పవన్ సమావేశం నిర్వహించారు. కొందరు పార్టీ నేతల చుట్టూ ఉన్న వివాదాలు ఆర్థిక, వ్యక్తిగత ఘర్షణలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత, కుల విభేదాలు, వివాహేతర సంబంధాల విషయంలో జరుగుతున్న గొడవలపై పవన్ ఆరా తీసినట్లు ఇన్‌సైడ్ టాక్.
వారిపై యాక్షన్ తీసుకోవాలన్న పవన్
అలాంటివన్నీ వ్యక్తిగత అంశాలుగా మాత్రమే చూడాలని..పార్టీ పరంగా వారిపై యాక్షన్ తీసుకోవాలని ముఖ్య నేతలకు సూచించారు పవన్. అయితే ఇలాంటివన్నీ పార్టీకి ఆపాదించే కుట్ర జరుగుతుందని అలాంటి వాటిని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారు పవన్. అయితే పవన్ ఇంతలా పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం స్థానిక సంస్థల ఎన్నికలే అంటున్నారు నేతలు.
సార్వత్రిక ఎన్నికల్లో 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలు మాత్రమే తీసుకున్న పవన్..స్థానిక సంస్థల ఎన్నికల్లో..మెజార్టీ స్థానాలు తీసుకుని పట్టు సాధించేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. కూటమిలో భాగంగా జనసేనకు బలం ఉన్నచోట్ల ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నారట. మార్చిలోపు పార్టీ నిర్మాణం పూర్తి చేసి..స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు.
పాలిటిక్స్ ఈజ్ ఆల్‌వేస్ డైనమిక్స్. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మారుతూనే ఉంటాయ్. పాలిటిక్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు చెప్పలేని పరిస్థితి. పైగా ప్రజెంట్ పాలిటిక్స్ అయితే వెరీ డిఫరెంట్. ఇవాళ ఓ పార్టీలో ఉన్న నేత రేపు ఏ పార్టీలో ప్రత్యక్షం అవుతారో..ఎందుకు పార్టీ మారుతారో అంతకంటే అర్థం కానీ పొలిటికల్ సినారియో ఈనాటిది. రాజకీయం అంటే అవసరాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నట్లుగా మారిపోయిన సిచ్యువేషన్.
రెండుచోట్ల ఓడినా.. విమర్శలు వచ్చినా..
కానీ జనసేన పుట్టుక వేరు. అది నడుస్తున్న తీరు వేరు. ఓ లక్ష్యం కోసం..రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్తుంటారు పవన్ కల్యాణ్. తానే రెండుచోట్ల ఓడినా..ఆయన పార్టీ ఎక్కువ రోజుల ఉండదని విమర్శలు వచ్చినా..ఆయనెక్కడా తగ్గలేదు. పదవుల కోసం ఆరాటపడలేదు. కానీ పార్టీని మాత్రం లైమ్‌లైట్‌లో ఉంచుతూ వచ్చారు.
ఎందుకంటే గతంలో ఎంతోమంది పార్టీలు పెట్టి కొన్ని రోజులు పాలిటిక్స్‌లో ఉండి తిరిగి బ్యాక్ టు పెవిలియన్ అన్నవారున్నారు. కానీ పవన్ రూటు సెపరేటు. ఆయనదంత ఫ్యూచర్ ప్లాన్. అధికారం, ప్రతిపక్షం అనే మాటల కంటే..మంచి కోసం మార్పు అనే లైన్‌లోనే పనిచేసుకుంటూ వస్తున్న సేనాని ఇప్పుడు సరికొత్త స్కెచ్ వేస్తున్నారట.
జనసేన అనేది అధికారం కోసం..అవసరాల కోసం ఏర్పడలేదని ప్రూవ్ చేసేందుకు..రాబోయే తరానికి మంచి నేతలను..మంచి రాజకీయ సంప్రదాయాలను అందించేలా ఫ్యూచర్ ప్లాన్ రెడీ చేశారట. అందుకు స్థానిక సంస్థల ఎన్నికలను, మున్సిపోల్స్‌ను అస్త్రంగా మార్చుకోవాలని భావిస్తున్నారట సేనాని. పవన్ స్ట్రాటజీస్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.