Pawan Kalyan : తెలంగాణను ఇలా దోచేస్తుంటేనే తన్ని తరిమేశారు- జగన్ సర్కార్‌పై పవన్ కల్యాణ్ ఫైర్, ఉత్తరాంధ్ర భూములు దోచేస్తున్నారని ఆగ్రహం

ఉద్యోగాలు లేవు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దళితులకు ఇచ్చిన భూముల్లో రోడ్లు ఎలా వేస్తున్నారు? Pawan Kalyan - YS Jagan

Pawan Kalyan - YS Jagan

Pawan Kalyan – YS Jagan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఏపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నారు. తెలంగాణను ఇలా దోచేస్తుంటేనే అక్కడ ఆంధ్ర వాళ్లను తన్ని తరిమేశారని పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అనకాపల్లి జిల్లా విస్సన్న పేటలో పవన్ కల్యాణ్ పర్యటించారు. వివాదాస్పద భూములను పరిశీలించారు. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ”రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం, అభివృద్ది జరగడం పట్ల మాకు అభ్యంతరం లేదు. ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. మరోవైపు 13వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను దోపిడీ చేస్తే ఎలా ఊరుకోవాలి? ప్రజలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే వైసీపీ నాయకులు మాత్రం రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి వేల కోట్లు దోచేస్తున్నారు.

Also Read..Galla Family: గల్లా కుటుంబం తరుఫున ఎవరు పోటీ చేసినా ఓకే.. టిక్కెట్ ఇచ్చేందుకు రెడీ!

విస్సన్నపేటలో 600 ఎకరాల పైచిలుకు పోరంబోకు, దళితుల భూములును దోచేసుకున్నారు. ఇందులో వాటర్ బాడీస్ క్యాచ్ మెంట్ ఏరియా కూడా ఉంది. ప్రకృతి విధ్వంసం, వోల్టా యాక్ట్ కు విరుద్ధం. ఇక్కడ వేస్తున్న రియల్ ఎస్టేట్ కు అనుమతులు లేవు. ఉత్తరాంధ్ర భూములు దోచేస్తుంటే ముఖ్యమంత్రి పట్టించుకోరు. తెలంగాణను ఇలానే దోచేస్తూ ఉంటేనే తన్ని తరిమేశారు. ఎన్జీటీ లాంటి కేంద్ర ఏజెన్సీలకు ఫిర్యాదు చేస్తా. మంత్రులు చేసే దోపిడీకి ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి.

ఉత్తరాంధ్ర భూములను దోచేస్తుంటే మాట్లాడే వారు లేరు. అనుమతులు లేని చోట రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. ఈ దోపిడీకి స్థానిక ఎమ్మెల్యే కూడా వత్తాసు పలుకుతున్నారు. ఉద్యోగాలు లేవు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దళితులకు ఇచ్చిన భూముల్లో రోడ్లు ఎలా వేస్తున్నారు? రెవెన్యూ శాఖ, కలెక్టర్ బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్తులను కాపాడే హక్కు మీకు లేదా? ప్రభుత్వ ఆస్తులను అడ్డగోలుగా దోచేస్తున్నారు” అని నిప్పులు చెరిగారు పవన్ కల్యాణ్.

Also Read..Bonda Uma : వైసీపీ 175కి 175 సీట్లు గెలిస్తే మా పార్టీని మూసేస్తాం : బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు