Pawan Kalyan
Pawan Kalyan: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ రిలే దీక్షకు పూనుకున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులకు నైతికంగా మద్దతు ఇచ్చేందుకు పవన్ దీక్ష చేపట్టినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో దీక్ష చేపట్టి సాయంత్రం 5 గంటల తర్వాత ప్రసంగించారు.
‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చేపట్టిన దీక్షకు వచ్చిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. సమస్య వచ్చినప్పుడు జనసేన గుర్తొస్తుంది. ఓటేసేటప్పుడు జనసేన గుర్తుకు రావాలి కదా. జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఏ పదవి ఆశించలేదు. గాజువాకలో ఓడినా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతున్నాం‘
‘వైసీపీ పాలసీలు బాగా లేనప్పుడు వాళ్ల వ్యక్తిగత జీవితాలపై మాట్లాడం సమస్యల గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడితే ఇళ్లలో వాళ్లను తిడతారు. స్టీల్ ప్లాంట్ అనేది చిన్న పరిశ్రమ కాదు.. ఆంధ్రుల ఆత్మ గౌరవం. మాట అంటే బీజేపీతో గొడవ పెట్టుకోవాలంటారు వైసీపీ నేతలు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధానిగా ఉండాలని మాట్లాడాను‘
…………………………………: కొడుకు ఆఖరి చూపుతో.. తల్లడిల్లిన తల్లి పేగు!
‘ఎంతో గొప్పదైన రాజ్యాంగాన్ని వైసీపీ నేతలు పాటించడం లేదు. మేం వ్యక్తిగతంగా సోషలిస్టు భావాలు కలిగిన వాళ్లం. నిరసన చేయాలంటే కలిసి రావాలి కదా. ఎన్నికలప్పుడు పార్టీ పరంగా పోటీ చేస్తారు. సమస్య వచ్చినప్పుడు మూకుమ్మడిగా ఒకే తాటిపైకి వచ్చి పోరాడాలి. ‘
పార్లమెంట్ లో ప్లకార్డు పట్టుకొనే దమ్ముందా
‘అఖిలపక్షం వేయమని అడిగాం అయినా స్పందించలేదు. చేతకాని 25మంది ఎంపిలు పార్లమెంట్ లో ఉన్నారు ఎందుకు. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని పార్లమెంట్ లో ప్లకార్డు పట్టుకొనే దమ్ముందా. మనం మాట్లాడితే గూండాయిజం, రౌడీయిజం చేస్తారు.. ప్రతిఒక్కరూ బెదిరించే వారే. ‘
గూండాయిజం భరిద్దాం
‘ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని ఎందుకు నిలదీయరని కార్మిక సంఘాలపై కోపంగా ఉంది. ప్రత్యేక హోదా కోసం తిరిగాను కానీ, ప్రజలు స్పందించకపోతే నేనొక్కడినే ఏం చేయలేను. కుల, వర్గ, పార్టీ సమస్య కాదు ఇది రాష్ట్ర సమస్య. ప్రజలే అధికారం ఇచ్చారు. ఇంకా రెండున్నరేళ్లు ప్రభుత్వాన్ని భరించక తప్పదు. 2024 వరకు రౌడీయిజం, గూండాయిజం భరిద్దాం..తర్వాత మనం చెబుదాం. ఓటుకు డబ్బులు తీసుకుంటే స్వయం కృతాపరాదమే. ‘
………………………………….: గుడ్ న్యూస్.. వరద బాధితులకు రుణాలు మాఫీ!
ప్రజలు నిలదీయాలి
‘ఓడిపోయిన ఎమ్మెల్యేని కాబట్టి ఎప్పుడూ అల్డిమేటం ఇవ్వలేదు. ప్రభుత్వాన్ని అభ్యర్ధించాను. ఒక్కడినే గెలవడానికి రాజకీయాల్లోకి రాలేదు. తరాలు గెలవాలి. డబ్బులు పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి రాలేదు. స్టీల్ ప్లాంట్‌కి న్యాయం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ప్రజల చేత ఓట్లు వేయించుకుంది ఎందుకు. ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలి. ‘
‘వైజాగ్ నుంచి కాదు మంగళగిరి నుంచి మాట్లాడితే ఇక్కడి నాయకత్వానికి వినిపిస్తుంది. అమరావతికి ఎలా నిలబడ్డామో విశాఖ స్టీల్ ప్లాంట్ పైనా నిలబడతాం. ‘
ఏపీని ప్రైవేటీకరణ చేసేస్తారా
‘స్టీల్ ప్లాంట్ అప్పు 22 వేల కోట్లు. అప్పుంటే అమ్మేస్తామంటే ఏపీకి రూ.4లక్షల కోట్లు అప్పు ఉంది. ఏపీని ప్రైవేటీకరణ చేసేస్తారా.‘
……………………………….: వారం రోజుల్లో మా బిల్డింగ్‌పై ప్రకటన
ఇప్పుడు చేయండి పాదయాత్ర
‘గతంలో పాదయాత్ర చేశారు కదా ఇప్పుడు చేయండి ప్రజలు స్పందన తెలుస్తుంది. పాదయాత్ర చేస్తే నేను సంఘీభావం తెలుపుతా. చినుకు అనే ఓటును వైసీపీ అనే పెనం మీద వేస్తామా. 2019లో వైసీపీ పెనం మీద ప్రజల జీవితాలు మాడిపోయాయి. ఓడిపోయినా ప్రజలముందుంది జనసేన మాత్రమే. ‘
అందుకే మోడీ అంటే ఇష్టం
‘దామోదర సంజీవయ్యను పట్టించుకోలేదు. తగిన గుర్తింపునివ్వడం లేదు. బీసీ, ఎంబీసీలకు, మహిళలకు తగిన సాధికారిత చూపుతాం. వారసత్వపు లేని రాజకీయాలు రావాలి అదే జనసేన కోరిక. అందుకే మోడీ అంటే ఇష్టం. ‘
‘మా జనసైనికులపైనే ప్రతాపమా వెళ్లి కేంద్రం పైన చూపండి. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి వైసీపీ హానికరం. వైసీపీ దాడులు చేస్తే మేం సుభాష్ చంద్రబోస్ వారసులవుతాం. మీకు భయపడే ప్రసక్తే లేదు. బుద్ది బలంతో ఎదుర్కొంటాం.‘
……………………………. : గుంటూరులో గంజాయి ముఠా అరెస్ట్ : రూ. 11 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
ఒక్కడినే దిగి చేతులు కాల్చుకోను
‘స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మేం నిలబడతాం. కార్మిక సంఘాలు, రైతులు నిలబడాలి. ప్రత్యేక హోదా లాగా ఒక్కడినే దిగి చేతులు కాల్చుకోను. ప్రజలంతా వస్తేనే దిగుతా. ఇది నా ఒక్కడిదే కాదు.‘
‘విజయనగరంలో బొత్స ఉన్నారు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి మాట్లాడతారు. శ్రీకాకుళంలో కూడా సీనియర్ నాయకులు ఉన్నారు వీరందరినీ అడగండి సంఘీభావం తెలపమని. వైసిపి ని ఒత్తిడి పెట్టడానికి కార్మికులు, కార్మిక సంఘాలకు ఎంత సమయం పడుతుందో చెప్పాలి.‘
ఢిల్లీదాకా ఎలా వెళ్లాలో నేను చూసుకుంటా
‘కార్మికులు, కార్మికుల సంఘాలు నిలబడితే ఢిల్లీదాకా ఎలా వెళ్లాలో నేను చూసుకుంటా. ఏపీలో లా అండ్ ఆర్డర్ బీహార్, ఉత్తరప్రదేశ్‌ను మించిపోయింది. ఎమ్మేల్యేలే రౌడీయిజానికి దిగుతున్నారు. మళ్లీ ఇలాంటి పరిస్ధితులు రాకూడదంటే 2024 లో మీ పూర్తి మద్ధతు నాకివ్వండి.‘
………………………………….: పాతికేళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి వెంకీ
అంటూ బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.