కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను.. మంత్రిగా జనసేనాని ప్రమాణం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

pawan kalyan sworn as andhra pradesh minister

pawan kalyan sworn : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దైవసాక్షిగా జనసేనాని ప్రమాణం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ.. పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం మొదలు పెట్టగానే సభా ప్రాంగణం పవన్ అభిమానుల కేరింతలతో మార్మోగిపోయింది. మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ సతీమణి, ఆయన పిల్లలు ఆసక్తిగా తిలకించారు.

చిరంజీవికి పాదాభివందనం
ప్రమాణస్వీకారం పూర్తి చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీకి శిరసు వంచి నమస్కారం చేశారు పవన్ కల్యాణ్. ఆయనను ప్రధాని మోదీ మనస్ఫూర్తిగా అభినందించారు. తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కరచాలనం చేశారు. వేదికపై ఆశీనులైన పెద్దలకు నమస్కారం చేశారు. తన అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు. తర్వాత సభా వేదిక ముందున్న ప్రజలకు అభివాదం చేశారు పవన్ కల్యాణ్. తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.