K. Narayana : పవన్ కళ్యాణ్ ఎన్డీఎతో కలవడం.. బీజేపీతో చేతులు కలపడం ప్రజాస్వామ్యం, లౌకిక వాదానికి ప్రమాదకరం : కె.నారాయణ

గతంలో విప్లవ వీరుడు చేగువేరా టీ షర్టులు వేసుకుని సోషలిజంపై గళం విప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మితవాద సంస్కరణల సావర్కర్ వైపు దారి తప్పి నడవడం సరికాదన్నారు.

K. Narayana

K. Narayana Comments Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఎతో కలవడం బాధాకరమని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. చేగువేరా నుండి సావర్కర్ వైపు పవన్ కళ్యాణ్ ప్రయాణం బాధాకరంగా ఉందని తెలిపారు. గతంలో విప్లవ వీరుడు చేగువేరా టీ షర్టులు వేసుకుని సోషలిజంపై గళం విప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మితవాద సంస్కరణల సావర్కర్ వైపు దారి తప్పి నడవడం సరికాదన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన హైదరాబాద్ లో  మీడియాతో మాట్లాడారు.

మతవాద పార్టీ అయినటువంటి బీజేపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి, లౌకిక వాదానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. తమతో పొత్తులు పెట్టుకోని ప్రాంతీయ పార్టీలను సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంటె డిపార్ట్ మెంట్ సంస్థలతో దాడులు చేయించడం వంటి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న బీజేపీకి మద్దతు పలకడం.. బీజేపీ, టీడీపీల మధ్య మధ్యవర్తిత్వం చేయడం రాజకీయాలకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

NDA Meeting : ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం.. హాజరు కానున్న 38 పార్టీలు

పవన్ కళ్యాణ్ ప్రవర్తన తీరు బాధాకరమని పేర్కొన్నారు. అయితే, ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది. ఎన్డీఏ సమావేశానికి రావాలని బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లారు. కాగా, వైసీపీ, టీడీపీకి ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానం రాకపోవడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు