NDA Meeting : ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం.. హాజరు కానున్న 38 పార్టీలు

ఎన్డీఏ మీటింగ్ కు ఎన్సీపీ చీలిక వర్గం నేతలు హాజరు కానున్నారు. అజిత్ పవార్ తో కలిసి ఎన్డీఏ భేటీకి హాజరుకానున్నట్లు ప్రపుల్ పటేల్ పేర్కొన్నారు.

NDA Meeting : ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం.. హాజరు కానున్న 38 పార్టీలు

NDA Meeting

Delhi NDA Meeting : దేశ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో అధికార బీజేపీ, ప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి. విపక్ష కూటమిని ఎదుర్కొనేందుకు ఇవాళ (మంగళవారం) ఎన్డీఏ కూటమి ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశానికి 38 పార్టీలు హాజరుకానున్నాయి. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. తొమ్మిదేళ్లలో బీజేపీ గ్రాఫ్ చాలా పెరిగిందని వెల్లడించారు. ఎన్డీఏ సమావేశానికి ఇప్పటికే ఉన్న మిత్ర పక్షాలతోపాటు కొత్తగా చేరిన పార్టీలకు ఆహ్వానాలు అందాయి.

ఎన్డీఏ మీటింగ్ కు ఎన్సీపీ చీలిక వర్గం నేతలు హాజరు కానున్నారు. అజిత్ పవార్ తో కలిసి ఎన్డీఏ భేటీకి హాజరుకానున్నట్లు ప్రపుల్ పటేల్ పేర్కొన్నారు. వీరితోపాటు బీహార్ లోనూ మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ ఓబీసీ నాయకుడు దివంగత రామ్ విలాశ్ పాశ్వాన్ కుమారుడు చిరాశ్ పాశ్వాన్ కు ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానం అందించింది. మరోవైపు ఒకప్పుడు ఎన్డీఏలో ఉండి బయటకు వెళ్లిన వారితోపాటు కూటమిలో చేరేందుకు ఆసక్తి ఉన్నవారిపై కమలం నేతలు ఫోకస్ పెట్టారు.

Opposition Meeting : బెంగళూరు వేదికగా విపక్షాల భేటీ… పాల్గొననున్న 24 పార్టీలు

ఇప్పటికే ఉత్తరప్రదేశ్ కు చెందిన సుహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్ భట్ ఎన్డీఏలో చేరుతున్నట్లు ప్రకటించారు. తూర్పు ఉత్తరప్రదేశ్ లోని ఓబీసీ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఎస్బీఎస్పీ 2019లో ఎన్డీఏ నుంచి వైదొలిగింది. తిరిగి మళ్లీ సొంత గూటికి చేరుతుంది. నిన్న మొన్నటి వరకు బీజేపీకి వ్యతరేకంగా పోరాడిన జేడీఎస్ అధినేత కుమార స్వామి ఎన్డీఏ కూటమిలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ప్రధానిని కలిసిన తర్వాత కమలం గూటికి చేరుతారని తెలుస్తోంది. మరోవైపు ఈ సమావేశానికి అన్నాడీఎంకే కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి పలనీస్వామి హాజరు కానున్నట్లు సమాచారం. మంగళవారం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ జరిగే సమావేశానికి వెళ్లి బీజేపీ సీనియర్ నేతలతో పలనీస్వామి సంప్రదింపులు జరుపనున్నట్లు తెలుస్తోంది.