పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం

  • Publish Date - September 12, 2020 / 04:34 PM IST

గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎక్సైజ్ ఎస్ఐ గీత ఆత్మహత్యా యత్నం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేధింపులే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సూపరింటెండెంట్ బాలకృష్ణన్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. బాలకృష్ణన్‌పై విచారణ కమిటి ఏర్పాటు చేశారు.


సూపరిటెండెంట్ బాలకృష్ణన్ పై కొంతకాలంగా వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బాలకృష్ణన్ పై విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ విచారణ కమిటీ ఎదుట బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బాలకృష్ణన్ తమను ఎలా వేధిస్తున్నారో చెప్పి బోరుమన్నారు. ఆయన వేధింపుల వల్లే మహిళా ఎక్సైజ్ ఎస్‌ఐ గీత ఆత్మహత్యాయత్నం చేశారని చెబుతున్నారు.