Namburu Shankar Rao: లోకేశ్, కొమ్మలపాటిని ఆహ్వానిస్తా.. తప్పకుండా రావాలి: వైసీపీ ఎమ్మెల్యే

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ వస్తుందో రాదో తెలియని కొమ్మలపాటి శ్రీధర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని నంబూరు శంకరరావు అన్నారు.

Namburu Shankar Rao, Kommalapati Sreedhar

Namburu Shankar Rao – YCP: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే, వైసీపీ నేత నంబూరు శంకరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి టీడీపీ నేతలు నారా లోకేశ్ (Nara Lokesh), కొమ్మలపాటి శ్రీధర్‌(Kommalapati Sreedhar)ను ఆహ్వానిస్తానని అన్నారు.

వారిద్దరు తప్పకుండా రావాలని నంబూరు శంకరరావు చురకలంటించారు. తనకు 400 ఎకరాల భూమి ఉందని లోకేశ్ ఆరోపణలు చేస్తున్నారని, అసలు తనకు అంత భూమి ఎక్కడుందో చెబితే అదంతా పేదలకే పంచుతానని చెప్పారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని టీడీపీ నేతలకు సవాలు విసిరారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని అన్నారు.

ఎమ్మెల్యేగా గెలవని లోకేశ్, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ వస్తుందో రాదో తెలియని కొమ్మలపాటి శ్రీధర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కృష్ణా నదిపై వంతెన నిర్మాణం ప్రారంభమైతే ఇప్పుడు లోకేశ్ కొత్తగా వచ్చి తాను భవిష్యత్తులో ఫ్లైఓవర్ కడతానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

కొమ్మలపాటి శ్రీధర్ కౌంటర్

నంబూరు శంకరరావు చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ స్పందించారు. లోకేశ్‌ను విమర్శించే స్థాయి శంకర్రావుకు లేదని అన్నారు. శంకర్రావు దళారీలు భూములు ఆక్రమించారని చెప్పారు. పోలీసుల భద్రత లేకపోతే నియోజకవర్గంలో కనీసం తిరిగలేని స్థితిలో శంకర్రావు ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టికెట్ దక్కుతుందో, దక్కదో చూసుకోవాలని అన్నారు.

Pawan Kalyan Video: తీవ్ర భావోద్వేగానికి గురై పవన్ కల్యాణ్ కన్నీరు..