Nara Lokesh
Pegasus Spyware : టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పెగాసస్ సాప్ట్ వేర్ కొనుగోలు చేసిందని వస్తున్న వ్యాఖ్యలను టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ శాఖమంత్రి నారాలోకేష్ ఖండించారు.
పెగాసస్ తన సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేయమని అడిగింది కానీ ప్రభుత్వం దాన్ని తిరిస్కరించిందని ఆయన తెలిపారు. మేము దానిని కొనుగోలు చేసి ఉంటే దానికి సంబంధించిన రికార్డులు ప్రభుత్వం దగ్గర ఉండి ఉంటాయని చెక్ చేసుకోవచ్చని అన్నారు.
టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ అక్రమ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడింది లేదని ఆయన అన్నారు. ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తప్పు సమాచారం అంది ఉంటుందని లోకేష్ అన్నారు. పెగాసస్ సంస్ధ సాప్ట్ వేరు ను కొనుగోలు చేయమని అడిగింది కానీ చంద్రబాబు నాయుడు తిరస్కరించారని ఆయన తెలిపారు.
మమతా బెనర్జీ ఏ సమయంలో, ఏ సందర్భంలో ఈ ప్రకటన చేశారో తనకు తెలియదని లోకేష్ అన్నారు. ఆమెకు సరైన సమాచారం లేకపోవటం చేత అలా అని ఉండవచ్చని ఆయన అన్నారు. అయినా చంద్రబాబు నాయుడు అలాంటి పనులు చేయరని లోకేష్ చెప్పారు.
Also Read: Tamilnadu : భర్తకు షాక్…పెళ్లైన నెలకే ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న ఇల్లాలు
ఒకవేళ మేము పెగాసెస్ సాప్ట్ వేర్ కొనుగోలు చేసి ఉంటే మూడేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం మాపై చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు. గడిచిన మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం మమల్ని ఏదో ఒక కేసులో ఇరికించాలని చూస్తూనే ఉందని.. మేము ఏ తపప్పు చయలేదు కాబట్టే మూడేళ్లలో మమల్ని ఏమీ చేయలేకపోయిందని… చంద్రబాబు నాయుడు వ్యవస్ధలు శాశ్వతమని నమ్మే వ్యక్తి అని ఇలాంటి వాటిని ప్రోత్సహించరని లోకేష్ చెప్పుకొచ్చారు.