Penna River
Penna river flowing briskly : నెల్లూరు జిల్లాను వర్షాలు మళ్లీ వణికిస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో.. పెన్నానదిలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం నెల్లూరు వద్ద పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని తీరం కోతకు గురవుతోంది. భగత్‌సింగ్ కాలానీలో.. ప్రమాదం పొంచి ఉంది. నది సమీపంలోని ఇళ్లు కోతకు గురవుతుండడంతో.. కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.
వారం క్రితం కురిసిన వర్షాల నుంచే రాయలసీమ, దక్షిణ కోస్తా ఇంకా కోలుకోవడం లేదు. ఇంతలోనే.. మరో వానగండం వచ్చిపడింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వాన ముప్పు పొంచి ఉండటంతో రాయలసీమ, కోస్తా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Launch Journey : నాగార్జున సాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణం..నేటి నుంచి పున:ప్రారంభం
రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలను కూడా వర్షం వదలట్లేదు. నెల గ్యాప్‌లో రెండు సార్లు అతి భారీ వర్షాలతో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు అతలాకుతలమైపోయాయి. మొన్న జరిగిన విధ్వంసం నుంచే.. ఇంకా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలు కోలుకోవడం లేదు. నెల్లూరు, కడప జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.