Cm Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి సానుకూలత ఉంది, వైసీపీ కుట్రల పట్ల అలర్ట్‌గా ఉండాలి- మంత్రులతో సీఎం చంద్రబాబు

24 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడా. కొందరికి నేను చెప్పిన తప్పులను అంగీకరించి సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు.

Cm Chandrababu: మంత్రులు ఏడాది కాలంలో సబ్జెక్టులు నేర్చుకుంటూ మెరుగ్గా పని చేశారని సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. ఇక హనీమూన్ కాలం వదిలి పరిపాలనలో దూకుడు పెంచాలన్నారు. తప్పుడు వార్తలను నిజాలుగా చేసే ప్రయత్నాలు, వైసీపీ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రులను హెచ్చరించారు చంద్రబాబు. అతి తెలివి ప్రదర్శిస్తున్న క్రిమినల్స్ పట్ల తెలివిగా వ్యవహరిస్తూ పూర్తి అప్రమత్తంగా పోలీసులు, రాజకీయ నాయకులు ఉండాలని సూచించారు. అంతర్జాతీయ సంబంధాల కోసం ఓ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామన్నారు.

సింగపూర్ విధానాలు అధ్యయనం చేసేందుకు మంత్రులు దశల వారీగా సింగపూర్ వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి సానుకూలత ఉందన్నారు. మంత్రుల పనితీరుతో ఆ సానుకూలత పెరగాలన్నారు. పనితీరు బాగోకుంటే సానుకూలత న్యూట్రలైజ్ అయ్యే ప్రమాదం ఉందన్నారు చంద్రబాబు.

”24 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడా. కొందరికి నేను చెప్పిన తప్పులను అంగీకరించి సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో జనసేన, బీజేపీ నాయకులు మాట్లాడుకుని లోపాలు సరిదిద్దుకోవాలి. మంత్రులు తమ శాఖలపై ప్రాజెక్ట్ రిపోర్టులు తయారు చేసుకోవాలి. వచ్చే మంత్రివర్గ సమావేశం నుంచి ఒక్కో మంత్రితో తమ శాఖ ఘనతపై కాసేపు మాట్లాడిస్తా” అని సీఎం చంద్రబాబు చెప్పారు.

మహిళలకు ఉచిత బస్సు టిక్కెట్ నమూనాను మంత్రులకు చూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మహిళలను అసభ్యంగా తిట్టే వాళ్ళ చర్యలను గట్టిగా తిప్పి కొట్టాలని మంత్రులో చెప్పారు. 8 ప్రధాన వ్యాధుల వల్ల వైద్య ఆరోగ్య శాఖలో 80 శాతం వ్యయం అవుతోందన్నారు. బిల్ గేట్ ఫౌండేషన్ తో కుప్పం లో చేస్తున్న ప్రాజెక్ట్ వివరాలను మంత్రులకు వెల్లడించారు సీఎం చంద్రబాబు.

Also Read: సింగపూర్ ప్రభుత్వం బాగా భయపడింది, కేసులు పెడతామని బెదిరించారు- జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్