Sajjala Ramakrishna Reddy (2)
Sajjala Ramakrishna Reddy : సీఎం కేసీఆర్ పై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఎన్నికల జరుగుతున్న దృశ్య రోడ్లు గురించి మాట్లాడుతున్నాడని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో అక్కడ ఉన్న ప్రజలకు తెలుసన్నారు. తెలంగాణలో కలిపిన పోలవరం ముంపు గ్రామంలో ఉన్న ఏడు మండలాల ప్రజలు ఏపీలోకి వస్తామని అంటున్నారని తెలిపారు. ఈ మండలాల్లో ప్రజలు ఎందుకు ఏపీలోకి వస్తున్నారు కేసీఆర్ గ్రహించాలన్నారు.
ఏపీలో అభివృద్ధిని చూసి ఏపీలోకి వస్తున్నామని 7 మండలాల ప్రజలు చెబుతున్నారని తెలిపారు. ఏపీలో అభివృద్ధి చూసి దేశం మొత్తం గర్విస్తుందన్నారు. గతంలో ఏపీలో పింఛన్లు ఎలా అమలు చేస్తున్నారు..అని తెలుసుకొని తెలంగాణలో కూడా అదే విధంగా అమలు చేయాలని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఏపీలో పాఠశాలలను తెలంగాణలో పాఠశాలను పరిశీలిస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో అనేది పూర్తిగా అర్థమవుతుందన్నారు.
BJP Third List : బీజేపీ మూడో జాబితాపై మహిళ నేతలు అసంతృప్తి.. కేవలం ఒక్కటే టికెట్ కేటాయింపు
అనారోగ్యం బాగాలేదని చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందన్నారు. మూడు గంటల్లో రాజమండ్రి నుంచి విజయవాడ చేరుకోవచ్చని తెలిపారు. కానీ, రాజమండ్రి నుంచి విజయవాడ రావటానికి చంద్రబాబుకు 14 గంటలు సమయం పట్టిందన్నారు. అనారోగ్యం ఉన్న వ్యక్తి ఎవరైనా 14 గంటలు కారులో కూర్చుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అర్ధరాత్రి వరకు రోడ్లు మీద ఉండి బ్రహ్మరథం పట్టారని కొంతమంది వ్యాఖ్యలు చేయటం హాస్యంగా ఉందన్నారు.
హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందన్నారు. ట్రాఫిక్ జాం ప్రాంతంలో చంద్రబాబు కాన్వాయ్ పెట్టి ప్రజలు భారీగా తరలివచ్చారని చెప్పటం సిగ్గుగా ఉందన్నారు. హైదరాబాదులో చంద్రబాబును చూసేందుకు వచ్చింది పచ్చ బ్యాచ్ మాత్రమేనని తెలిపారు.