Perni Nani
ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న వేళ టీడీపీని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‍గా మారాయి. పవన్ కల్యాణ్ రాజోలు, రాజానగరం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆడిన రాజకీయ డ్రామాలను చూసి ఇప్పటికే ప్రజలు విసిగిపోయారని పేర్ని నాని చెప్పారు. వారి డ్రామాలకు ప్రజలు నవ్వుకుంటున్నారని, ఇప్పుడు మరో కొత్త డ్రామాతో ప్రజల ముందుకు వచ్చారని అన్నారు. నాలుగున్నరేళ్లుగా రాజానగరం, రాజోలు నియోజకవర్గాలకు టీడీపీకి ఇన్‌ఛార్జిలే లేరని చెప్పారు.
ఈ స్థానాలను చంద్రబాబు నాయుడు జనసేనకే వదిలేశారని పేర్ని నాని తెలిపారు. జనసేనకు కేటాయించిన సీట్లనే పవన్ ఇవాళ ప్రకటించారని అన్నారు. జనసైనికుల్లో, పార్టీ నేతల్లో తనపై వస్తున్న వ్యతిరేకతను తగ్గిచేందుకే పవన్ ఇవాళ మరో డ్రామా ఆడారని చెప్పారు. పవన్ కల్యాణ్‌కు ఉన్న పౌరుషం నికార్సయినదయితే కీలక స్థానాలను ప్రకటించే వారని అన్నారు. వైజాగ్, విజయవాడ, కాకినాడ, తిరుపతి వంటి స్థానాల్లో ఎందుకు అభ్యర్థులను ప్రకటించలేదని ప్రశ్నించారు.
కాగా, రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరు గమనిస్తే…రానున్న అసెంబ్లీ- లోక్‌సభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి తాను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. తనను తక్కువగా తీసుకుని, ఏవో కొన్ని సీట్లు ఇచ్చేస్తే సరిపోతుందని అనుకోవద్దని, తనకు రావాల్సిన గౌరవకరమైన వాటా రావాల్సిందేనని నర్మగర్భంగా తెలుగుదేశం పార్టీకి తెలియచెప్పారు. జనసేనను తేలిగ్గా తీసుకోవద్దని, వన్‌వే ట్రాఫిక్‌లా పొత్తు ఉండదని పవన్ చెప్పకనే చెప్పారు.
Gummanur Jayaram: గుమ్మనూరు జయరాంకు షాక్.. కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా మేయర్ రామయ్య