Perni Nani
Perni Nani – YCP: జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన రెండు చెప్పులను ఎవరో దొంగిలించారని, ఎవరికైనా కనిపిస్తే పట్టుకోండని, తన చెప్పులు తనకు ఇప్పించాలని చేసిన వ్యాఖ్యలపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు.
కృష్ణా జిల్లాలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ… చెప్పులు పోతే మూడు రోజుల తర్వాత పవన్ కల్యాణ్ కంగారు పడుతున్నారని ఎద్దేవా చేశారు. గత సంవత్సరం అక్టోబర్ 18న రాత్రి తాను లింగమనేని చెందిన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లానని, అప్పట్లో తనది ఒక చెప్పు పోయిందని చెప్పారు.
ఒకే ఒక్క చెప్పు పోయి తొమ్మిది నెలలు అవుతుందని, అందుకు ఎవరిని అనుమానిస్తామని పేర్ని నాని అన్నారు. ఎదురుగా పవన్ కల్యాణ్ ఆఫీస్ ఉంటే ఆయనను అనుమానిస్తామా? అని అన్నారు. చెప్పులు పోతే పోయాయని, ముందు పార్టీ సింబల్ గాజు గ్లాస్ పోయిందని, పవన్ కల్యాణ్ అది చూసుకోవాలని పేర్ని నాని చెప్పారు.
గాజు గ్లాస్ గల్లంతూ చాలా కాలం అవుతుందని అన్నారు. మూడు రోజుల క్రితం పోయిన చెప్పుల కోసం కంగారు ఎందుకని నిలదీశారు. కాగా, వైసీపీ ప్రభుత్వం గుడిలో తన చెప్పులు కూడా పట్టుకుని వెళ్లిపోతుందంటూ పవన్ కల్యాణ్ శుక్రవారం కాకినాడలోని పిఠాపురంలో నిర్వహించి వారాహి విజయ యాత్ర చురకలు అంటించిన విషయం తెలిసిందే. 2022, అక్టోబరు 18న పవన్ తొలిసారి తన కుడికాలి చెప్పు తీసి వైసీపీని హెచ్చరించారు.
తనను దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని ఎవరైనా అంటే చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల ఆ విషయాన్ని గుర్తు చేశారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని రెండు రోజుల క్రితం తన రెండు చెప్పులూ చూపిస్తూ పవన్ పై పలు వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan: కాకినాడలో తీవ్ర భావోద్వేగానికి గురైన పవన్ కల్యాణ్