Pawan Kalyan: కాకినాడలో తీవ్ర భావోద్వేగానికి గురైన పవన్ కల్యాణ్

దివ్యాంగులకు కనీసం పెన్షన్ ఇవ్వలేని అంధకారంలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు.

Pawan Kalyan: కాకినాడలో తీవ్ర భావోద్వేగానికి గురైన పవన్ కల్యాణ్

Pawan Kalyan

Updated On : June 17, 2023 / 4:46 PM IST

Pawan Kalyan – Janavani : ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ(Kakinada)లో జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడి పరిస్థితి గురించి తెలుసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమకు పెన్షన్ అందడం లేదని, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఓ దివ్యాంగుడు, మహిళ చెప్పారు.

దివ్యాంగులకు కనీసం పెన్షన్ ఇవ్వలేని అంధకారంలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. కాగా, జనవాణి కార్యక్రమంలో మత్స్యకారులు కూడా పాల్గొని తమ సమస్యలు చెప్పుకున్నారు. దేవాలయ భూములను పోర్ట్ కోసం అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తీసుకున్నారంటూ మత్స్యకారులు చెప్పారు.

అర్చకులకు రూ.5 వేల గౌరవ వేతనం అని వైసీపీ ప్రభుత్వం చెప్పిందని, అవి ఎలా సరిపోతాయని పలువురు అర్చకులు పవన్ తో అన్నారు. జనవాణి కార్యక్రమంలో పలువురు క్రైస్తవ ప్రభోదకులు మాట్లాడుతూ… వైసీపీ సర్కారు క్రైస్తవులకు ఏ విధమైన న్యాయం చేయలేదని అన్నారు.

శానిటరీ వర్కర్లు కూడా పవన్ కు తమ బాధలు చెప్పుకున్నారు. అలాగే, ఏపీలో న్యాయవాదులకు రూ.5 వేల సహకారం ఇస్తామని సీఎం జగన్ బటన్ నొక్కారని, తమకు ఇప్పటి వరకు కాకినాడలో ఆ డబ్బు పడలేదని లాయర్లు అన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా జనవాణి కార్యక్రమాలను పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్నారు.

Seediri appalaraju : చెప్పులు పొతే తెచ్చుకొవచ్చు,కానీ పార్టీ గుర్తుపోతే ఎలా..? : పవన్‌పై మంత్రి సిదిరి సెటైర్లు