Perni Nani
Perni Nani – Pawan Kalyan: జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్‌కు మాటలెక్కువ.. చేతలు తక్కువ.. అంటూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. వాలంటీర్ల ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదని ఆ శాఖ కోర్టులో దావా వేసిందని తెలిపారు.
పవన్ కల్యాణ్‌ను కొట్టాలంటే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొట్టాలని, తమకు మాత్రం ఆ అవసరం లేదని పేర్ని నాని చెప్పారు. అలాగే, అరెస్టు చేయాల్సిన అవసరం తమకేంటని, పవన్ చేసేది తప్పు అనిపిస్తే కోర్టు అరెస్టు చేయిస్తుందని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ బలంగా ఉండటంతో దానిపై పవన్ కల్యాణ్ బురద చల్లుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజాసాధికార సర్వే పేరుతో డేటా చౌర్యం చేశారని పేర్ని నాని అన్నారు. మరి అప్పుడు పవన్ కల్యాణ్ నోరు ఎందుకు విప్పలేదని నిలదీశారు. జనసేన పార్టీ సభ్యత్వానికి ఫోన్ నంబర్, ఆధార్, ఈ-మెయిల్, ఓటర్ ఐడీ ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. అది డేటా చౌర్యం కాదా అని నిలదీశారు.
తాము సేకరిస్తున్న డేటా ప్రభుత్వం దగ్గరే ఉందని, దమ్ముతో చెబుతున్నామని అన్నారు. అమిత్ షాతో మాట్లాడితే ఎవరికి గొప్ప అని పవన్ కల్యాణ్ మాత్రమే గొప్పగా భావిస్తున్నారని చెప్పారు. పవన్ దగ్గర విషయం లేదు కనుక మోదీ, అమిత్ షా పేర్లను పవన్ ప్రస్తావిస్తున్నారని అన్నారు.
అమిత్ షాతో మాట్లాడితే జగన్ పని అయిపోద్దా అని నిలదీశారు. జగన్ ను జైలుకు పంపిస్తా అని పవన్ అంటున్నారని, దమ్ముంటే పంపించాలని సవాలు విసిరారు. కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కాగా, పవన్ కల్యాణ్ కు ఇప్పటికే నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తనను అరెస్టు చేసి, జైలులో పెట్టినా భయపడనని పవన్ స్పష్టం చేశారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి.. ఏయే సెక్షన్ల కింద అంటే?