Perni Nani
Perni Nani – Pawan Kalyan: టీడీపీ.. పార్టీ ఇన్‌చార్జిలను పెట్టిన ప్రాంతాల్లో జనసేన ఇన్‌చార్జిలను పెట్టదని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కృష్ణా (Krishna) జిల్లాలోని మచిలీపట్నం (Machilipatnam) కలెక్టరేట్‌లో పేర్ని నాని మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ కు ఏదో ఒకటి మాట్లాడేసి వెళ్లిపోవడం అలవాటు అని చురకలంటించారు.
పవన్ మాటలకు ప్రజలు నవ్వుకుంటారన్న విషయాన్నీ పట్టించుకోవడం లేదని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై బురద చల్లడమే పనిగా పవన్ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. అంతకు మంచి ఏమీ లేదని, ఏదో కిరాయి తీసుకున్నందుకు మాట్లాడాలని మాట్లాడుతున్నారని చురకలంటించారు.
జగన్ పై విపరీతమైన ద్వేషంతో ఏదో ఒకటి మాట్లాడాలనుకుంటున్నారని పేర్ని నాని చెప్పారు. చంద్రబాబు కోసం పనిచేస్తున్నానని పవన్ ఒప్పుకోవచ్చుగా అని అన్నారు. జగన్‌ను అటాడించే సత్తా ఉన్నోడివైతే, మరి స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడవని నిలదీశారు. జగన్ ని అటాడిస్తానని చెబుతున్న పవన్.. మరి ప్రజల సమస్యల గురించి మాట్లాడరా? అని అడిగారు.
సినిమా గ్లామర్ ను అడ్డం పెట్టుకుని ప్రజలను అమ్మేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నుంచి ఎవ్వరినీ జనసేన పార్టీలోకి రానివ్వనని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎవరిని పడితే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని చెప్పారు. నిలకడ లేని రాజకీయాలను చేస్తున్నారని విమర్శించారు.
MLA Anil Kumar Yadav: సోనియా గాంధీనే భయపెట్టిన వ్యక్తి జగన్.. పవన్ వారాహికి పెట్రోల్ దండగ ..