AP Government Departments Shifting To Visakhapatnam (Photo : Google)
విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 2283 సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్నారు. పిల్ వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్ గా దాఖలు చేయటాన్ని కోర్టుకు దృష్టికి తెచ్చారు ఏజీ శ్రీరామ్. ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందని ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
పిటిషనర్లు అమరావతిలో భూములు కలిగి ఉన్నారని చెప్పారు. జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు రిట్ పిటిషన్ దాఖలు చేశారని, వాస్తవానికి ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) రూపంలో దాఖలు చేయాల్సి ఉందని చెప్పారు. రాజధానితో ముడిపడి ఉన్న అంశం సీజే బెంచ్ లేదా ఫుల్ బెంచ్ ముందుకు మాత్రమే రావాల్సి ఉంటుందన్నారు.
Also Read : రేవంత్ రెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభినందనలు
కానీ పిటిషనర్లు తెలివిగా కావాలని రిట్ పిటిషన్ ను దాఖలు చేశారని, ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. పిటిషనర్ల ఉద్దేశం క్లియర్ గా ఫోరమ్ షాపింగ్ అనేది అర్దం అవుతోందన్నారు. ఫోరమ్ షాపింగ్ పై పలు జడ్జిమెంట్లను ఉదహరించారు ఏజీ శ్రీరామ్. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు.
Also Read : చంద్రబాబుపై సీఐడీ పీటీ వారెంట్లను తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు